calender_icon.png 21 November, 2025 | 3:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాకు న్యాయం చేయండి కదం తొక్కిన గిరిజనం

21-11-2025 12:04:18 AM

మణుగూరు, నవంబర్ 20 ( విజయక్రాం తి) : పోడు, సాగు భూములకు పట్టాలు ఇవ్వాలని ఫారెస్ట్ అధికారుల వేధింపులు ఆపాలని, కోయ కుల ధ్రువపత్రాల వెంట నే జారీ చేయాలని డిమాండ్ చేస్తూ మం డలంలోని వివిధ గ్రామాలకు చెందిన వల స ఆదివాసిలు డోలు కొమ్ములతో, గజ్జల ఆట,పాటలతో గిరిజన సాంప్రదాయాలు ప్రదర్శిస్తూ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వ హించారు. అనంతరం తాహసిల్దార్ కా ర్యాలయం ముందు తమ సంస్కృతి సాంప్రదాయాలతో నృత్యాలు చేస్తూ నిర సన తెలిపారు.

ఈ సందర్భంగా అసలైన ఆదివాసీలమైన తమకు రాజ్యాంగం కల్పించిన హక్కులను ఇక్కడ అధికారు లు కాలరాస్తున్నారని నినదించారు. తక్ష ణమే కుల ధ్రువ పత్రాలను జారీ చేయాల ని, సమస్యలకు పరిష్కారం చూపాలని పెద్ద పెట్టున నినాదాలు చేశారు. అనంత రం తాహసిల్దార్ నరేష్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి సత్రపల్లి సాంబశివరా వు అధ్యక్షతన జరిగిన సభ లో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు అన్నవరపు కన కయ్య మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు ఆదివాసీల సమస్యలను పరిష్క రించడంలో విఫలమయ్యాయని విమ ర్శించారు.

ఆదివాసీ గ్రామాలు అభివృద్దికి ఆమడ దూరంలో ఉన్నాయని పేర్కొన్నా రు. ఆదివాసీలు సాగు చేస్తున్న పోడు భు ములకు హక్కు పత్రాలు ఇచ్చే విషయంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టత ఇవ్వా లని డిమాండ్ చేశారు. ఆదివాసి గ్రామా లలో తక్షణమే మౌలిక వసతులు కల్పిం చాలని, ఫారెస్ట్ దౌర్జన్యాలను ఆపాలని, ఇందిరమ్మ ఇళ్లను కేటాయించాలని, అధి కారులను కోరారు. కార్యక్రమంలో గిరిజ న సంఘం రాష్ట్ర నాయకులు మడివి రమేష్, పిట్టల నాగమణి, రాజు, కొడిశాల రాములు, నరసింహారావు, గౌరీ, భీమ య్య, రాజు,సారిక, సంతోష్, నందయ్య, రమేష్ పాల్గొన్నారు.