calender_icon.png 11 January, 2026 | 10:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పండగ బొమ్మ.. హ్యాట్రిక్ దక్కేనా?

03-01-2026 12:00:00 AM

ప్రముఖ హీరోయిన్ మీనాక్షి చౌదరి గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన నటన అంతకుమించిన అందమైన శరీర సౌష్ఠవంతో అందరి హృదయాలు దోచుకుందీ యువ కథానాయకి. సంక్రాంతిని సెంటిమెంట్‌గా పెట్టుకుందీ బ్యూటీ. గత రెండు సంక్రాంతి సినిమాలు, వాటి ఫలితాలు చూస్తే నిజంగా మీనాక్షికి సంక్రాంతి సెంటిమెంట్ అని చెప్పకుండా ఉండలేరంటే అతిశయోక్తి కాదు. 2024 సంక్రాంతి బరిలో నిలిచిన మహేశ్‌బాబు ‘గుంటూరు కారం’ సినిమాలో నటించి మంచి విజయాన్ని అందుకుంది.

కిందటేడాది వెంకటేశ్ కథానాయకుడిగా వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా సంక్రాంతికి విడుదలై రూ.300 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన ప్రాంతీయ చిత్రంగా రికార్డు సృష్టించింది. ఈ సినిమా తర్వాత ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు కూడా వరుస కట్టాయి. ఇక ఈ యేటి సంక్రాంతి సినిమాల్లో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తున్న ‘అనగనగా ఒక రాజు’ కూడా ఉంది.

నవీన్ పోలిశెట్టి హీరోగా వస్తున్న ఈ సినిమా జనవరి 14న థియేటర్లలో అడుగుపెట్టనుంది. ఇప్పటికే రెండు సార్లు సంక్రాంతి రేసులో దిగి మంచి విజయాలను ఖాతాలో వేసుకున్న మీనాక్షి చౌదరి.. మళ్లీ సంక్రాంతి సెంటిమెంట్‌ను రిపీట్ చేయడానికి సిద్ధమవుతోంది. ఈ సినిమా విజయం సాధించిస్తే.. వరుసగా మూడు పండుగలకు పలకరించిన తొలి హ్యాట్రిక్ హీరోయిన్‌గా కూడా రికార్డు ఆమెకు దక్కుతుంది.