02-01-2026 12:00:00 AM
యాసంగిలో పెరుగుతున్న విస్తీర్ణం
మహబూబాబాద్, జనవరి 1 (విజయక్రాంతి): యాసంగి సీజన్లో మొక్కజొన్న పంట సాగుకు అన్నదాతలు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. మహబూబాబాద్ జిల్లాలో యాసంగి సీజన్లో గత కొద్ది సంవత్సరాలుగా మొక్కజొన్న సాగు విస్తీర్ణం గణనీయంగా పె రుగుతోంది. నీటి తడులు తక్కువగా ఇవ్వ డం, సాగు పెట్టుబడి కొంత అనుకూలంగా ఉండడం, ఆశించిన దిగుబడి లభించడం, ధర కూడా మెరుగ్గా ఉంటుండడంతో మొక్కజొన్న సాగుకు అన్నదాతలు ముగ్గు చూపు తున్నారు.
వానాకాలం సీజన్లో జిల్లావ్యాప్తంగా 56 వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేయగా, యాసంగి సీజన్లో సాగు విస్తీర్ణం మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. 2022 సంవత్సరంలో యాసంగి సీజన్లో జిల్లావ్యాప్తంగా 45,538 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేయగా, వాన కాలంలో 48, 919 ఎకరాల్లో సాగు చేశారు. 2023లో వా నకాలంలో 51,777, యాసంగిలో 45,505, 2024 వాన కాలంలో 56,643, యాసంగిలో 61, 060, వానకాలంలో 56,643 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారు.
ఈ ఏడా ది యాసంగి సీజన్లో మొక్కజొన్న సాగు గతంతో పోలిస్తే మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. వానకాలం వరి పంట కోతల పూర్తిచేసిన తరి భూము ల్లో మొక్కజొన్న సాగు చేపట్టారు. అలాగే మెట్ట ప్రాంతాల్లో కూడా నీటి వసతి ఉన్న చోట మొక్కజొన్న సాగు చేస్తున్నారు. దీంతో జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా మొక్కజొ న్న పంట సాగు పనుల్లో రైతులు నిమగ్నమయ్యారు.
ఇప్పటికే ముందస్తుగా మొక్కజొన్న పైరు పిలక దశకు రాగా, చాలా చోట్ల మొక్కజొన్న పంట సాగు వివిధ దశల్లో ఉంది. వానకాలం పంటల సాగు తర్వాత యాసంగి పంటల్లో అత్యధికంగా నీటి వసతి అధికంగా ఉన్న చోట వరి సాగు చేస్తుండగా, మిగిలిన చోట్ల మొక్కజొన్న పంట సాగుకు అన్నదాతలు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఫలితంగా గత యాసంగి సీజన్తో పోలిస్తే ఈసారి మొక్కజొన్న సాగు జిల్లా వ్యాప్తంగా పెరిగే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.
మద్దతు ధర, కూలీల ఖర్చు తక్కువ
మొక్కజొన్న సాగులో కూలీల ఖర్చు తక్కువ, మద్దతు ధర లభించడం, ప్రభుత్వం కొనుగోలు చేయడం, దిగుబడి అధికంగా ఇవ్వడం వల్ల మొక్కజొన్న పంట సాగు పైపు ఆసక్తి చూ పుతున్నాం. తక్కువ కాలంలో పంట దిగుబడి ఇవ్వడం, ఇతర వాణిజ్య పంటలతో పోలిస్తే ఆదాయం గణనీయంగా లభించడం వల్ల రోజురోజుకు మొక్కజొన్న సాగు విస్తీర్ణం పెరుగుతుంది. అపరాలు, ఇతర వాణిజ్య పంటల తో పోలిస్తే మొక్కజొన్న పంట సాగు లో పె ట్టుబడి, శ్రమ తగ్గడం కూడా మొక్కజొన్న సాగుకు రైతులు ఆసక్తి చూపిస్తున్నారు.
తోట వెంకన్న, రైతు, కేసముద్రం