calender_icon.png 2 January, 2026 | 3:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ట్రాఫిక్ రూల్స్ పాటించాలి

02-01-2026 12:00:00 AM

ప్రజల భద్రతే ఆర్టీసీ లక్ష్యం

జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ 

మెదక్, జనవరి 1(విజయక్రాంతి): రోడ్డు ప్రమాదాలను తగ్గించి ప్రజల్లో అవగాహన పెంచడమే లక్ష్యంగా రోడ్డు భద్రత మాసోత్సవాలు నిర్వహిస్తున్నామని మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ తెలిపారు. మెదక్ ఆర్టీసీ బస్సు డిపోలో ఏర్పాటు చేసిన రోడ్డు భద్రతా మహోత్సవాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ వాహనాలు నడిపే ట  ప్పుడు ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటించడం ద్వారా అనేక విలువైన ప్రాణాలను కాపాడవచ్చని అన్నారు.

మాసోత్సవాల సందర్భంగా జిల్లా వ్యాప్తంగా అవగాహన ర్యాలీలు, సద స్సు లు, శిక్షణా కార్యక్రమాలు, స్కూల్-కళాశాలలలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. రోడ్డు ప్రమాదాలలో ఎక్కువగా యువత, పనిచేసే వర్గం ప్రభావితమవుతున్న నేపథ్యంలో వారు మరింత జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డిపో మేనేజర్ సురేఖ, పోలీస్ అధికారులు, రవాణా శాఖ అధికారులు, సంబంధిత ప్రతినిధులు పాల్గొన్నారు.