02-01-2026 12:00:00 AM
ములుగు,జనవరి1(విజయక్రాంతి): ములుగు జిల్లాలో సమిష్టిగా అందరం కలిసి రోడ్డు ప్రమాదాల నియంత్రణకు కృషి చేద్దామని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.పిలుపుని చ్చారు. ఇందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని ట్రాఫిక్ రూల్స్ పాటించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.గు రువారం జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. తన ఛాంబర్లో జాతీయ రోడ్డు మాసోత్సవం సందర్భంగా రవాణా శాఖ ఆద్వర్యంలో ప్ర చురించబడిన జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలకు సంబంధించిన ఫ్లెక్సీ,పోస్టర్లు, కరపత్రాలను అధికారులతో కలిసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జనవరి ఒకటి నుంచి 31వరకు జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవం జరుగుతుందని తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు రవాణా శాఖ అధికారులు వివిధ కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. సామాజిక బాధ్యతగా ట్రాఫిక్ రూల్స్ అందరు పాటించేలా పెద్ద ఎత్తున అవేర్నెస్ తీసుకురావాలని పేర్కొన్నారు. ఇందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తెలిపారు.
పాఠశాలల విద్యార్థులకు ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పించాలని తద్వారా వారి తల్లిదండ్రులకు వివరించేలా చూడాలని చెప్పారు. ఇందుకు ప్రైవేట్ స్కూ ల్స్ యజమాన్యాలు ప్రత్యేక చొరవ తీసుకోవాలని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారిపై కఠినంగా వ్యవహరించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు.