calender_icon.png 28 May, 2025 | 1:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిండా ముంచిన ‘మీనం’ సీడ్!

27-05-2025 12:00:00 AM

- దొడ్డు మిర్చి రైతులను మోసం చేసిన ఖమ్మం జిల్లాలోని నర్సరీ

- 40 రోజులు దాటినా పూయని పూత.. కాయని కాత

- చేవెళ్ల మండలం చన్వల్లి, పామెనలో 100 ఎకరాల్లో సాగు

- ఎకరాకు రూ. 1.50 లక్షలు నష్టపోయిన 60 మంది రైతులు

- కలెక్టర్, ఆర్డీవోకు ఫిర్యాదు.. న్యాయం చేయాలని డిమాండ్

చేవెళ్ల, మే 26: దొడ్డు (బజ్జి) మిర్చి హై బ్రిడ్ ‘మీనం’ సీడ్ పేరుతో రైతులను నిండా ముంచాడో నర్సరీ నిర్వాహకుడు.  మొక్క ఏ పుగా పెరుగుతుందని, పూత, కాత బాగుంటాయని, దిగుబడి మెండుగా వస్తుందని చె ప్పి.. నాసిరకం నారు అంటగట్టి మోసం చేశాడు. 

రెండు నెలల కింద  చేవెళ్ల మండ లం చన్వల్లి, పామెన గ్రామాలకు వచ్చిన అత ను ఖమ్మం జిల్లా వైరా పరిధిలోని కొనిజెర్ల మండలం మధిర రోడ్డులో ఉన్న మహికో గ్రో(mahyco grow) నర్సరీకి చెందిన కొరివి సునీల్ కుమార్ గా పరిచయం చేసుకున్నాడు.  తమ వద్ద బజ్జి మిర్చికి సంబం ధించి ‘మీనం’ సీడ్ ఉందని, మంచి ఎదుగుదలతో పాటు దిగుబడి బాగా వస్తుందని నమ్మించాడు.

ఎండలు, వర్షాలను కూడా తట్టుకుంటుందని చెప్పాడు.  అతని మాట లు నమ్మిన కొందరు రైతులు అక్కడికి వెళ్లగా ఓ నర్సరీకి తీసుకెళ్లి నారు చూపించాడు. దీంతో బుక్ చేసుకున్న  రైతులు అశ్విని కార్తె ప్రారంభమయ్యే ఏప్రిల్ 14న నారు డెలివరీ చేయాలని కోరగా, అతను పంపించాడు.  మొక్క దశలో బాగానే ఉండడంతో మరికొందరు రైతులు కూడా ఆర్డర్లు పెట్టారు.  ఇలా చన్వల్లిలో 40 మంది రైతులు 70 ఎకరాల్లో,  పామెనలో 20 మంది రైతులు 30 ఎకరాల్లో సాగు చేశారు. 

ఎదగని మొక్కలు

నారు వేసి 40 రోజులు దాటినా మొక్కలు ఎదగలేదు.  చాలా మొక్కలు  తెగు లు సోకి వేర్ల దగ్గర నుంచే కిందపడి చనిపోతున్నాయి.  కొన్ని కొ ద్దిగా ఎదిగినా పూ త, కాత రాలే దు. కొన్ని చోట్లు దొడ్డు మిర్చి స్థా నంలో సన్నవి కాస్తున్నా యి. లోకల్ నర్సరీల నుంచి నారు తెచ్చిన రైతు ల పొలాల్లో మాత్రం ఏపుగా పెరిగి కాత కూ డా కాస్తోంది.

దీంతో మోసపోయామని గ్రహించిన బాధిత రైతులు నారు సప్లై చేసిన వ్యక్తికి ఫోన్ చేశారు.  ఆయన సరిగ్గా స్పందించలేదు సరికదా.. తానేం చేయలేనని, అవస మైతే కోర్టుకు వెళ్తానని బెదిరింపులకు దిగా డు.  దీంతో రైతులు మూడు రోజుల కింద కలెక్టర్ నారాయణ రెడ్డికి ఫిర్యాదు చేయగా, ఆయన చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ జేడీకి రిఫర్ చేశారు. 

జేడీ వెంటనే ఫీల్ విజిట్ చేసి రిపోర్టు ఇవ్వాలని స్థానిక అగ్రికల్చర్, హార్టికల్చర్ ఆఫీసర్లను ఆదేశించారు.  రైతులు సోమవారం కూడా ఆర్డీవో చంద్రకళకు ఫిర్యాదు చేయగా.. ఆమె మండల వ్యవసాయ అధికారికి రెఫర్ చేశారు.    

ఎకరాకు రూ.1.50 లక్షలపెట్టుబడి

లారీ కోడి ఎరువు రూ.35 వేలు, మల్చిం గ్, డ్రిప్ రూ.50 వేలు, అడుగు, పిచికారీ మందులు రూ.25 వేలు, 15 వేల మొక్కలు (ఒక్కోటి రూ.1.35 నుంచి రూ.2 వరకు),  ఇతర ఖర్చులు రూ. 20 వేలు కలిపి రూ. 1.50 లక్షలు పెట్టుబడి పెట్టామని రైతులు చెబుతున్నారు.  ప్రతి ఏటా పంటను బోయి న్ పల్లి మార్కెట్కు తీసుకెళ్లి ఎకరాకు రూ.5 నుంచి 6 లక్షల వరకు అమ్మేవాళ్లమని, అన్ని ఖర్చులు పోనూ రూ. 3 లక్షలు మిగిలేవన్నారు.

ఈ సారి మాత్రం పెట్టుబడి కూడా నష్టపోయామని వాపోయారు.  గతంలో రవి సీడ్ కంపెనీకి చెందిన ‘కీర్తి’  రకం మిర్చి సాగు చేసేవాళ్లమని, అయితే 2021లో ఇలా సమస్య వస్తే వాళ్లు ఎకరాకు రూ.75 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించారని వెల్లడించారు. ఆ తర్వాత లోకల్ నర్సరీల నుంచి తెచ్చి సాగు చేసుకుంటున్నామని,  ఈ సారి మాత్రం ఖమ్మం నర్సరీని నమ్మి మోసపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. 

బిల్స్ కూడా ఇవ్వలేదు

 రైతుల నుంచి ఫోన్ పే, గూగుల్ పేతో పాటు మాన్యువల్గా డబ్బులు తీసుకున్న నర్సరీ నిర్వాహకుడు  బిల్స్ మాత్రం ఇవ్వలేదు.  అయితే చన్వల్లికి చెందిన రాజశేఖర్ రెడ్డి  బిల్ కావాల్సిందేనని కొట్లాడి మరీ తీసుకున్నాడు.

అందులో మహారాష్ట్రలోని ఈసెలింగ్ (ease ling)హైబ్రిడ్  సీడ్ కంపెనీకి చెందిన ‘మీనం’ సీడ్,  మహికో గ్రో నర్సరీ తరపున 25 వేల మొక్కలు(ఒక్కోటి  రూ.2) డెలివరీ చేసినట్లు ఉంది.  కాగా, రైతును వన్ టైం కస్టమర్ అని, కండీషన్స్లో మొక్కల నాణ్యత విషయంలో నర్సరీ బాధ్యత తీసుకోదని, ఏదైనా సమస్య ఉంటే సీడ్ కంపెనీనే సంప్రదించాలని పేర్కొనడం గమనార్హం. 

ఫీల్ట్ విజిట్ చేసి రిపోర్టు పంపిస్తాం

అగ్రికల్చర్ ఆఫీసర్ తో కలిసి ఫీల్ విజిట్ చేసి పైఅధికారులకు ప్రిలిమినరీ రిపోర్టు సబ్మిట్ చేస్తాం.  వాళ్ల ఆదేశాల మేరకు సైంటిస్టులు శాంపిల్ సేకరించి ల్యాబ్ కు పంపిస్తారు.  అక్కడి నుంచి వచ్చే రిజల్ట్ ఆధారంగా చర్యలు ఉంటాయి.  రైతులు కూడా ప్రభుత్వం గుర్తించిన కంపెనీల వద్దే సీడ్స్ కొనాలి.  తప్పని సరిగా బిల్స్ తీసుకోవాలి.   

కీర్తి, హార్టికల్చర్ ఆఫీసర్, చేవెళ్ల

ప్రభుత్వం న్యాయం చేయాలి

 మహికో గ్రో నర్సరీ నిర్వాహకుడు సునీల్ కుమార్ వద్ద ఒక్కో మొక్క రూ.1.35 చొప్పున 15 వేల బజ్జి మిర్చి మొక్కలు తీసుకొచ్చి ఎకరంలో సాగు చేశాను. 40 రోజులు దాటినా మొక్క ఎదగడం లేదు, ఎక్కడా పూత, కాత కనిపించడం లేదు. పైగా చాలా మొక్కలు చనిపోయాయి. ఇప్పటికే రూ.1.50 లక్షల పెట్టుబడి అయింది.  ప్రభుత్వం స్పందించి మాకు న్యాయం చేయాలి.

 నర్సిములు, చన్వల్లి మాజీ సర్పంచ్

నమ్మి మోసపోయిన

పూత, కాత బా గుంటాయని చెప్తే నమ్మి మోసపోయి న. అప్పులు చేసి అరెకరం పొలంలో బజ్జి మిర్చి పంట వేసిన.  మొక్కలన్నీ సచ్చిపోతున్నయి. వాటి జాగాల దాట్లు వేద్దామన్నా కాలం దాటిపోయింది. ఇ ప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు.

 మంగలి కృష్ణయ్య, చన్వల్లి