calender_icon.png 29 May, 2025 | 5:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యూనిఫాంలు సిద్ధంగా ఉంచాలి

28-05-2025 01:38:00 AM

కామారెడ్డి, మే 27, (విజయ క్రాంతి): పాఠశాలలో ప్రారంభానికి ముందే యూనిఫాం లు సిద్ధంగా ఉంచాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. మంగళవారం దోమకొండ మండల కేంద్రంలో నిర్వహిస్తున్న యూనిఫాం కుట్టు కేంద్రాన్నీ కలెక్టర్ సందర్శించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఈ విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే విద్యార్థులకు పంపిణీ చేసే యూనిఫాం లను సిద్ధం చేయాలని అన్నారు. జిల్లాలో 72,081 యూనిఫాం లకు గాను, 34428 మంది మగపిల్లలు, 37653 మంది ఆడపిల్లలకు యూనిఫాం పంపిణీ చేయవలసి ఉందని తెలిపారు.

ఇప్పటి వరకు సిద్ధం చేసిన వివరాలు, విద్యార్థుల కొలతలు, కుట్టు విధానం, కటింగ్ విధానాన్ని కలెక్టర్ పరిశీలించారు.  మండలంలో కేటాయించిన రేచర్జీ స్ట్రక్చర్స్ లను త్వరగా నిర్మించాలని, రైతులను ప్రోత్సహించాలని తెలిపారు.అనంతరం ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ను కలెక్టర్ పరిశీలించారు.  కార్యక్రమాల్లో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేందర్, మండల ప్రత్యేక అధికారిణి, జిల్లా ఉద్యాన అధికారిణి జ్యోతి, డిపిఎం రమేష్, తహసీల్దార్, ఎంపీడీఓ, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించాలి

జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగువాన్ 

కామారెడ్డి, మే 27 ( విజయ క్రాంతి): తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జూన్ 2 న జరుగనున్న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ప్రభుత్వ ఆదేశాల మేరకు స్థానిక ఇందిరాగాంధీ ఆడిటోరియం లో నిర్వహించాలని అన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు వి.విక్టర్, చందర్, ఆర్డీఓ వీణ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.