05-01-2026 12:00:00 AM
గుండాల, జనవరి 4 (విజయక్రాంతి): మండల పరిధిలోని యాపలగడ్డ గ్రామ సమీప పగిద్దరాజు గద్దెల వద్ద ఆదివారం ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికలలో గెలుపొందిన ఆదివాసీ సర్పంచ్, ఉపసర్పంచులను ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.
ఆదివాసీ సంక్షేమ పరిషత్ మండల అధ్యక్షులు పూనెం రమణబాబు అధ్యక్షతన జరిగిన ఈ సన్మాన కార్యక్రమంలో నూతన సర్పంచులు కోరం సీతారాములు (గుండాల), కల్తి రాధ (ముత్తాపురం), కల్తి రజిత (మామకన్ను), చింత వెంకటేశ్వర్లు (లింగగూడెం), కల్తి కృష్ణారావు (దామరతోగు), కల్తి కృష్ణవేణి (సాయనపల్లి), ఈసం సుమలత (శంభునిగూడెం), ఢిల్లీ వసంతరావు (శెట్టుపల్లి), ఆయా గ్రామపంచాయతీల ఉప సర్పంచులను ఘనంగా సన్మానించారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆదివాసీ నాయకులు మాట్లాడుతూ.. గుండాల మండలంలో 1/70 చట్టాన్ని ప్రతిష్టంగా అమలు చేయడానికి మీరంతా కృషి చేయాలని కోరారు. రాబోయే రోజులలో లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలనే నినాదానికి మీ తోడ్పాటు అందించాలని, ఆదివాసీల అస్తిత్వం కోసం జరగబోయే ఉద్యమాలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.
ఈ సన్మాన కార్యక్రమంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్ జిల్లా అధ్యక్షులు వాగబోయిన చంద్రయ్య దొర, ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి సనప విష్ణు, తుడుందెబ్బ రాష్ట్ర కార్యదర్శి కోడెం వెంకటేశ్వర్లు, తుడుందెబ్బ ప్రధాన కార్యదర్శి ముక్తి రాజు, తుడుందెబ్బ ప్రచార కార్యదర్శి తాటి మధు, పెండెకట్ల మహేందర్, గొగ్గెల సుధాకర్, పూనెం వసంత్, ఎదలపల్లి వసంత్, కల్తి జోగయ్య, మోకాళ్ళ కృష్ణ, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.