calender_icon.png 4 November, 2025 | 8:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గుమ్మడి నర్సయ్యకు అవార్డులు పక్కా

04-11-2025 01:13:14 AM

ఓ వ్యక్తి జీవిత చరిత్రను తెరపైకి తీసుకు రావడం సాధారణ విషయం కాదు. పైగా ఓ రాజకీయ నాయకుడు.. అజాత శత్రువు.. నిజాయితీ పరుడు.. ప్రజల కోసం బతికే నాయకుడైన గుమ్మడి నర్సయ్యలాంటి వ్యక్తి చరిత్రను తెరపైకి తీసుకు వస్తుండటం సాహసమే అవుతుంది. ఆ సాహసాన్ని యువ దర్శకుడు పరమేశ్వర్ హివ్రాలే చేస్తుండగా, ఆయనకు ప్రవల్లిక ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్ తరపున ఎన్ సురేశ్‌రెడ్డి అండగా నిలబడ్డారు. ఇక ‘గుమ్మడి నర్సయ్య’ పేరుతోనే వస్తున్న ఈ చిత్రంలో కరుణాడ చక్రవర్తి శివ రాజ్‌కుమార్ టైటిల్ రోల్‌లో కనిపించనున్నారు.

ఇటీవల ‘గుమ్మడి నర్సయ్య’ మోషన్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. గుమ్మడి నర్సయ్య పాత్రలో శివరాజ్‌కుమార్ ఎలా కనిపిస్తారు? ఏ మేరకు ఆకట్టుకుంటారు? అని అంతా అనుకున్నారు. కానీ, అందరి అంచనాల్ని తలకిందులయ్యేలా టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.

పాత్రకు తగ్గ ఆహార్యంతో శివన్న అందరినీ ఆకట్టుకున్నారు. తాజాగా ఈ మోషన్ పోస్టర్ గురించి శ్యామలాదేవి కృష్ణంరాజు మాట్లాడుతూ.. ‘ఈ మోషన్ పోస్టర్ చూస్తేనే సినిమా ఎలా ఉండబోతోందో అర్థమవుతోంది.. ఎన్ని అవార్డులు వస్తాయో తెలుస్తోంది.. గుమ్మడి నర్సయ్యగా శివరాజ్‌కుమార్ ప్రాణం పెట్టి నటిస్తున్నట్టు కనిపిస్తోంది.. చిత్రయూనిట్‌కు ఆల్ ది బెస్ట్‌” అని పేర్కొన్నారు. ఈ చిత్రానికి కెమెరామెన్‌గా సతీశ్ ముత్యాల, సంగీత దర్శకుడిగా సురేశ్ బొబ్బిలి, ఎడిటర్‌గా సత్య గిడుటూరి పనిచేస్తున్నారు.