24-10-2025 12:24:59 AM
ఇంతకుముందు ‘ఎఫ్2’, ‘ఎఫ్3’తో నవ్వులు పంచిన వెంకటేశ్ రావిపూడి జోడీ ఇప్పుడు ఆ నవ్వులను రెట్టింపు చేసేందుకు చిరుతో జతకట్టారు. తద్వారా రాబోయే ‘విక్టరీ’కి ‘మెగా’ స్వాగతం పలికేశారు! అర్థం కాలేదా? చిరంజీవి హీరోగా దర్శకుడు అనిల్ రావిపూడి ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమాను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా, వెంకటేశ్ ఓ ముఖ్యపాత్రలో అలరించనున్నారు.
ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్‌లోని భారీ సెట్‌లో జరుగుతోంది. వెంకటేశ్ గురువారం షూటింగ్‌లో పాల్గొన్నారు. చిరంజీవి కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ ఓ ప్రత్యేక వీడియోలో చిరు ఆకట్టుకున్నారు. షైన్‌స్క్రీన్స్, గోల్డ్‌బాక్స్ ఎంటర్‌టైన్ మెంట్స్ పతాకాలపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్న ఈ సినిమా 2026 సంక్రాంతికి విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్ సిసిరోలియో; సినిమాటోగ్రఫీ: సమీర్‌రెడ్డి; ఎడిటర్: తమ్మిరాజు; ఆర్ట్: ఏఎస్ ప్రకాశ్.