calender_icon.png 30 January, 2026 | 3:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మానవాళికి మార్గదర్శి!

30-01-2026 12:00:00 AM

నేడు జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి :

శాంతియుత జీవనతత్వం తో ఆధునిక చరిత్రలో అత్యంత ప్రభావశీల వ్యక్తులలో ఒకరిగా నిలిచారు మహాత్మా గాంధీ. గాంధీ చేసిన పోరాటం ప్రపంచమంతటినీ ఆకర్షించిం ది. జాతి సమగ్రతను, ఐక్యతను నిలబెట్టేందుకు గాంధీ అనుసరించిన మార్గం అందరికీ ఆదర్శమైంది. 200 సంవ త్సరాల బ్రిటిష్ పాలనను ఎదిరించిపోరాడిన ఘనత గాంధీ జీది. నేడు ఆ మహనీయుడి వర్ధంతి. 1948 జనవరి 30న బిర్లా హౌస్ వద్ద నాథూరామ్ గాడ్సే అందరూ చూస్తుండగా మహాత్ముడిపై కాల్పులు జరిపాడు. హే రామ్ అంటూ మహాత్ముడు ప్రాణాలు విడిచారు.

గాంధీ వర్ధంతిని షహీద్ దివస్‌గా జరుపుకుంటున్నాం. భారత స్వాతంత్య్ర పోరాటంలో ఆయన కీలక పాత్ర పోషించారు. అహింసాత్మక పౌరహక్కులు, సామాజిక సంస్కరణలను ప్రోత్సహించి ప్రపంచవ్యాప్త ఉద్యమాలకు పునాది వేశారు. సత్యాన్వేషణే జీవిత లక్ష్యంగా గాంధీ జీవించారు. సిద్ధాంతం, ఆచరణ మధ్య గీతను తొలగించి.. సత్యం, అహింసే ధ్యేయంగా జీవితాన్ని గడిపి సమస్త మానవాళికి మార్గదర్శకుడిగా నిలిచారు. గాంధీజీ సామ్యవాద దృక్పథం, రాజకీయ భావజాలం కన్నా సామాజిక సంక్షేమం, నైతిక బాధ్యతలపైనే ఎక్కువగా ఆధారపడింది.

భారతదేశంలో ప్రజా విధానాలపై గాంధీయ ఆలోచనలు ఇప్పటికీ ప్రభావం చూపుతున్నాయి. పేదరిక నిర్మూలన, సార్వత్రిక విద్య, ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధి లక్ష్యంగా రూపొందిన సర్వ శిక్షా అభియాన్, ఆయుష్మాన్ భారత్, స్కిల్ ఇండియా, స్వచ్ఛ భారత్ అభియాన్ వంటి కార్యక్రమాలు గాంధీ ఉద్ఘాటనను ప్రతిబింబిస్తాయి. విద్య యువతను నైతికంగా, వ్యక్తిగతంగా, సామాజికంగా బాధ్యతాయుతమైన భావి పౌరులుగా తయారుచేస్తుందని గాంధీజీ విశ్వసించేవారు. యువతకు నైపుణ్యాన్ని అందించడం ద్వారా నిరుద్యోగ సమస్యను పరిష్కరించవచ్చు.

శిక్షణ పిల్లల్లో అన్ని సామర్థ్యాలను పెంపొందించాలని, తద్వారా విద్యార్థులు సంపూర్ణ మానవులుగా మారాలని గాంధీజీ బలంగా నమ్మారు. అక్షరాస్యత అనేది విద్యకు ప్రారంభం లేదా ముగింపు కాదు. ఇది స్త్రీ లేదా పురుషుడు చేయగల సాధనం మాత్రమే. విద్య అనేది వ్యక్తిత్వానికి సంబంధించిన అన్ని అంశాలను సామరస్యపూర్వకంగా అభివృద్ధి చేయాలని గాంధీజీ  వివరించారు. విద్య ముఖ్యమైన లక్ష్యాలలో ఒకటి. ప్రతి ఒక్కరు తనలో దైవశక్తిని గ్రహించి దైవిక మానవునిగా ఎదగాలని గాంధీజీ ఆకాంక్షించారు.

గాంధీజీ ప్రతిపాదించిన గ్రామ స్వరాజ్యం ఈరోజు మనం అమలుప రుస్తున్న పంచాయతీరాజ్ వ్యవస్థకు మూలం. భారతదేశంలోని గ్రామాల మధ్య రాజకీయ అధికారం పంపిణీ చేయాలని గాంధీ కోరుకున్నారు. నిజమైన ప్రజాస్వామ్యం అని పిలిచే దానిని వివరించడానికి గాంధీ ‘స్వరాజ్’ అనే పదానికి ప్రాధాన్యత ఇచ్చారు. గాంధీ దృష్టిలో వ్యక్తిగత స్వేచ్ఛ, స్వయంప్రతిపత్తి కలిగిన, స్వయం- ఆధారమైన సంఘాలలో మాత్రమే నిర్వహించబడు తుంది.

ఇది ప్రజలకు సంపూర్ణ భాగస్వామ్యం కోసం అవకాశాలను అందిస్తుంది. మాతృదేశమైన భారతదేశ స్వాతంత్య్రానికి గాంధీజీ చేసిన అహిం సాయుత పోరాటం దేశప్రజలకే కాదు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకు స్ఫూర్తిదాయకంగా నిలిచింది. గాంధీజీ జీవితం, ఆయన ఆదర్శాలు ప్రపంచ మానవాళికి మార్గదర్శకాలు.

 సురేశ్‌బాబు, కరీంనగర్