calender_icon.png 30 January, 2026 | 5:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెట్టుబడులతోనే ఆగిపోవద్దు!

29-01-2026 12:00:00 AM

దావోస్ పర్యటన ద్వారా ఎంవోయూలు, వాటిల్లోని పెట్టుబడుల అంకెలు పతాక శీర్షికలో రావడం ప్రతిపక్షాలకు మింగుడు పడని అంశం. కానీ పెట్టుబడులతోనే ఆగకుండా అవి వాస్తవ రూపం దాల్చేవరకు ప్రభుత్వం అదే ఉత్తేజంతో కృషి చేయాలి.  

ప్రభుత్వమంటే ప్రజలను పాలించడం ఒక్కటే సరిపోదు. తమ పాలన ఎలా ఉందో, ప్రపంచ దేశాలకు చాటాల్సిన అవసరముంది. దిగ్గజ కంపెనీల వ్యవస్థాపకులను రాష్ట్రానికి ఆహ్వానించి పె ట్టుబడులను ఆకర్షించడంతో పాటు ఆయా కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు అన్ని రకాల సదుపాయాలూ కల్పించాలి. వీలైనం త త్వరగా వారికి లైసెన్సులు ఇవ్వాలి. అప్పు డే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుంది. తాజాగా స్విట్జర్లాండ్‌లోని దావోస్ వేదికగా జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బృందం ఆశాజనక ఫలితాలను సాధించిందని చెప్పొచ్చు.

కొత్త పెట్టుబడులతోపాటు భవిష్యత్తు పెట్టుబడులకు తెలంగాణను గమ్యస్థానంగా మార్చ డంలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదిక చక్క గా ఉపయోగపడింది. ఆంధ్రప్రదేశ్ తో పో ల్చితే తెలంగాణకు అధిక పెట్టుబడులు రావడానికి గ్రేటర్ హైదరాబాద్ ఒక బ్రాండ్‌లా నిలిచింది. అందువల్లే పెట్టుబడులు సులభంగా వచ్చేందుకు అవకాశాలు ఏర్పడ్డాయి. అంతకుముందు చాలా దిగ్గజ కంపెనీలు హైదరాబాద్‌లో ఆఫీసులు, కంపెనీలు ప్రా రంబించాయి.

ఇక్కడ ఉన్న సదుపాయాలతో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు ఆయా కంపెనీలు ఆసక్తి చూపించడం సహజం. సీఎం రేవంత్ నాయకత్వంలోని ‘తెలంగాణ రైజింగ్’ టీమ్ మూడు రోజుల పాటు జరిగి న ప్రపంచ ఆర్థిక సదస్సులో సుమారు రూ. 28,693 కోట్ల పెట్టుబడులకు సంబంధించి దిగ్గజ కంపెనీలతో కీలక అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. మొత్తంగా ఈ పర్యటనతో తెలంగాణ ఏఐ ఇన్నోవేషన్ హబ్‌కు గ్లోబల్ సపోర్ట్ బలపడింది. రాష్ట్రా న్ని ఏఐ రాజధానిగా మార్చేందుకు కీలక అడుగులు పడ్డాయి. 

పారిశ్రామిక వృద్ధి..

తెలంగాణలో ఐటీకి బ్రాండ్ కేటీఆర్ అని చెప్పుకునే రోజులు పోతున్నట్లుగా అనిపిస్తున్నది. 2023లో 19,900 కోట్ల పెట్టుబడులు నాటి బీఆర్‌ఎస్ తెస్తే.. గతేడాది సీఎం రేవం త్ నేతృత్వంలో మొదటిసారి 40,232 కో ట్లు పెట్టుబడులను తీసుకురావడం విశేషం. ఐటీ పెట్టుబడులు ఎవరి సొత్తూ కాదని పేర్కొన్న రాష్ట్ర ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు రాష్ట్రానికి అత్యధిక పెట్టుబడులు తీసుకొచ్చి నూతనోత్తేజం కల్పించడం లో విజయవంతమయ్యారు.

అంతేకాదు రా ష్ర్టంలో ఉన్న నిరుద్యోగులను పారిశ్రామిక రంగంలో భాగస్వాములను చేసేందుకు కాం గ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోంది. యువతీ, యువకుల నైపుణ్యాలను వెలికితీసేందుకు నిర్విరామంగా శ్రమిస్తుందని చెప్పొచ్చు. రా ష్ట్ర నలుమూలల పారిశ్రామికాభివృద్ధిని చేపట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తుంది. సరికొత్త పారిశ్రామిక విధానానికి రూపకల్పన చేసింది. రాష్ట్ర ప్రభుత్వ అధికారుల సమన్వయం, అలుపెరుగని కృషితో తెలంగాణ రైజింగ్, విజన్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించడం వల్ల ప్రపంచ దేశాల్లో తెలంగాణ పేరు మార్మోగింది. రాష్ర్టంలో దిగ్గజ కంపెనీలు 5.75 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టి చరిత్ర సృష్టించాయి.

చర్చలు సఫలమేనా!

అదే ఉత్సాహంతో దావోస్ పర్యటనకు వెళ్లి అంతర్జాతీయ సంస్థలతో జరిపిన చర్చ లు, సంప్రదింపులు విజయవంతంగా ముగిశాయి.పలు ప్రధాన కంపెనీలు అయినా ర ష్మి గ్రూప్‌తో రూ.12,500 కోట్ల పెట్టుబడి తో స్టీల్ ప్లాంట్‌ను తెలంగాణలో స్థాపించబోతున్నారు. సుమారు 12 వేల ఉద్యోగాలు రావొచ్చనే అభిప్రాయం కూడా ఉంది. రూ. 6 వేల కోట్లతో రియాక్టర్ విద్యుత్ ప్లాంట్, స్నేడర్ ఎలక్ట్రిక్ కంపెనీ సంగతి చూస్తే.. రూ.623 కోట్లతో గాగిల్లాపూర్, శంషాబాద్‌లో యూనిట్లను విస్తరించనున్నది. పియ ర్సన్ కంపెనీ తెలంగాణలో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ)ఇన్నోవేషన్ హబ్ కింద గ్లోబల్ ఏఐ అకాడమీకి, ఏఐ స్కిల్లింగ్, కరికులమ్ సపోర్ట్ చెయ్యడానికి ముందుకొ చ్చింది.

జార్జ్‌టౌన్ యూనివర్సిటీ ఏఐ కోలా బ్ సంస్థ.. తెలంగాణలో హెల్త్‌కేర్ రంగంలో ఏఐ అప్లుడ్ రీసెర్చ్, ట్రైనింగ్ సహకారం అం దించేందుకు ఆసక్తి చూపింది. దుబాయ్ మల్టీ కమోడిటీస్ సెంటర్.. తెలంగాణలో స్టార్టప్‌లకు మార్కెట్ యాక్సెస్, ఈవెంట్లకు సహకారం అందించేందుకు ముందుకొచ్చిం ది. బ్లైజ్ సంస్థ..హైదరాబాద్‌లో ఆర్ అండ్ డీ సెంటర్‌ను విస్తరించేందుకూ, ఏఐ హార్డ్‌వేర్ అండ్ సాఫ్ట్‌వేర్ రంగాన్ని డెవలప్ చేసేం దుకు ఆసక్తి చూపించింది. ఇదే సమయంలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి సమావేశమై, ఇరు రాష్ట్రాల అభివృద్ధికి సహకారం ఇచ్చిపుచ్చుకునేందుకు ముం దుకు రావడం ముదావహం. 

ఫాలోఅప్ సదస్సుకు మార్గం!

వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదిక దావోస్ సమ్మిట్‌లో పాల్గొన్న రేవంత్ టీం తెలంగాణ రైజింగ్ విజన్ లక్ష్యాలతో పాటు వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ఫాలో అప్ సదస్సును నిర్వ హించే ప్రతిపాదనలను చర్చించారు. ప్రతి ఏడాది జూలైలో హైదరాబాద్‌లో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ఫాలోఅప్ సదస్సు నిర్వ హించాలని ప్రతిపాదించారు. దావోస్‌లో తీసుకున్న నిర్ణయాల పురోగతిని సమీక్షించుకునేందుకు తెలంగాణ పెవిలియన్ సమావే శాల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది. దాని ద్వారా తెలంగాణలో ఉన్న మానవ వనరులు, పారిశ్రామిక రంగంలో ఉన్న అనుకూలతలు, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు, ప్రభుత్వ విధానాలను.. ప్ర పంచానికి చూపించాలనే ఆలోచనను పం చుకునేందుకు ఫాలోఅప్ సమావేశం ఉపకరించనుంది. అందుకే హైదరాబాద్‌లో ఫాలోఅప్ ఫోరమ్ నిర్వహించాలని బలమైన ప్రతిపాదనను తీసుకొచ్చి ఆకర్షించే విషయంలో సీఎం రేవంత్ ఆసక్తి అందరిని ఆకట్టుకుంది.

అయితే వరల్డ్ ఎకనమిక్ ఫోర మ్ సంస్థ కూడా రేవంత్ ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తున్నది. మరో విషయం ఏమిటంటే ప్రపంచం లో వివిధ దేశాల నుండి ప్రతిపాదనలు వచ్చినప్పటికీ, తెలంగాణ రైజింగ్, విజన్ 2047.. మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే రోడ్ మ్యాప్, దాని లక్ష్యాలను ఆకర్షితులై సమీప భవిష్యత్ లో నిర్ణ యం తీసుకుంటామని హామీ ఇవ్వడం నూ తన ఒరవడిగా చెప్పుకోవచ్చు. అద్భుతమైన పారిశ్రామిక విధానాలతో ఇప్పటికే నైపుణ్యాలను వెలికితీసేందుకు, సానబట్టేందుకు అడ్వాన్స్ డ్ టెక్నాలజీ సెంటర్లు,యాంగ్ ఇం డియా స్కిల్స్ యూనివర్సిటీ, యాంగ్ ఇండి యా స్పోర్ట్స్ యూనివర్సిటీ ద్వారా సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 

వాస్తవరూపం దాలిస్తేనే!

అయితే విదేశీ పెట్టుబడులకు ప్రోత్సా హం ఇస్తూనే పరస్పర సహకారంతో తెలంగాణ అభివృద్ధి చేసుకోవచ్చని స్విట్జర్లాండ్ లోని దావోస్ వేదికగా జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికగా ప్రకటించారు. దీనిపై అనేక అంశాలను చర్చించుకున్నారు. నిత్యం ఇబ్బంది పెడుతున్న కాలుష్యం నివారణకు రేవంత్ టీం ఐనాక్స్ గ్రూప్ డైరెక్టర్ దేవాంశ్ జైన్ తో సమావేశమయ్యింది. తెలంగాణ కృత్రిమ మేధ ఇన్నోవేషన్ హబ్‌గా తీర్చిదిద్దాలన్న సంకల్పం మరో కీలక పెట్టుబడిని సాధించింది. నెదర్లాండ్‌కు చెందిన యూపీ సీ రెన్యువబుల్స్ గ్రూప్, వోల్ట్ డేటా సెంట ర్స్ కలిసి ఐదు సంవత్సరాల్లో 5వేల కోట్లతో యూపీసీ వోల్ట్ సంస్థ ఫ్యూచర్ సిటీలో 100 మెగావాట్ల ఏఐ డేటా సెంటర్ ను నెలకొల్పనుంది.

తొలి నెట్ జీరో గ్రీన్ ఫీల్డ్ స్మార్ట్ సిటీ గా ఫ్యూచర్ (ఫోర్త్ సిటీ) సిటీ ప్రపంచ స్థాయి నగరంగా అభివృద్ధి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్దపడగా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) అభివృద్ధిలో భాగస్వామిగా ముందుకొచ్చింది. తెలంగాణ రైజింగ్ విజన్ 2047 దావోస్ మంచు కొం డల్లో ప్రతిధ్వనించింది. పేరు మోసిన దిగ్గజ కంపెనీలు క్యూ కట్టడం రేవంత్ సర్కార్ కృషికి నిదర్శనం. ఈ పర్యటన ద్వారా ఎంవోయూలు, వాటిల్లోని పెట్టుబడుల అంకెలు పతాక శీర్షికలో రావడం ప్రతిపక్షాలకు మింగుడు పడని అంశం. కానీ పెట్టు బడులతోనే ఆగకుండా అవి వాస్తవ రూపం దాల్చేవరకు ప్రభుత్వం అదే ఉత్తేజంతో కృషి చేయాలి.  

వ్యాసకర్త సెల్: 9866255355

డాక్టర్ సంగని మల్లేశ్వర్