calender_icon.png 15 May, 2025 | 12:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలి

14-03-2025 01:35:06 AM

ఎస్‌సిఈఆర్ టీ రాష్ట్ర అబ్జర్వర్ డాక్టర్ ఎల్లయ్య

మంచిర్యాల, మార్చి 13 ( విజయక్రాంతి ) : విద్యార్థులకు నాణ్యమైన, గుణాత్మకమైన, ప్రభావంతమైన విద్య అందించాలని ఎస్ సి ఈ ఆర్ టీ రాష్ట్ర అబ్జర్వర్ డాక్టర్ జె ఎల్లయ్య అన్నారు.

గురువారం జిల్లాలోని వివిధ పాఠశాలలను సందర్శించి  పదవ తరగతి విద్యార్థుల  అభ్యసన స్థాయిలు, వారి ఫలితాల కోసం జిల్లాలో అమలవుతున్న కార్యాచరణ, కృత్రిమ మేధ ద్వారా విద్యార్థులకు సామర్ధ్యాల పెంపుదల, మధ్యాహ్న భోజనం, తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ యాప్ లో వివిధ పరీక్షల వివరాల నమోదు, విద్యార్థుల సిలబస్ పూర్తి మొదలైన వివిధ రకాల కార్యక్రమాలు ఏ విధంగా అమలవుతున్నాయో క్షుణ్ణంగా పరిశీలించారు.

మంచిర్యాల జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, కాసిపేట ఆదర్శ పాఠశాల, కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయం కాసిపేటలను మరొక పరిశీలకులు స్టాలిన్ తో కలిసి తనిఖీ చేశారు. వివిధ రకాల రికార్డులను పరిశీలించారు. కొన్ని అంశాలలో సూచనలు చేశారు. రాష్ట్ర అబ్జర్వర్ వెంట మంచిర్యాల జిల్లా సమగ్ర శిక్ష క్వాలిటీ కోఆర్డినేటర్ సత్యనారాయణమూర్తి తదితరులు ఉన్నారు.