calender_icon.png 27 October, 2025 | 7:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తుది మెరుగులద్దుకుంటున్న కిల్లర్

27-10-2025 12:57:33 AM

శుక్ర, మాటరాని మౌనమిది, ఏ మాస్టర్ పీస్ వంటి విభిన్న చిత్రాలతో సినీప్రియుల దృష్టిని ఆకట్టుకుంటున్నారు దర్శకుడు పూర్వజ్. ఇప్పుడు ‘కిల్లర్’ అనే ఓ సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ చిత్రంతో రాబోతున్నారు. ఇండియా ఫస్ట్ సూపర్ షీ మూవీగా ఈ చిత్రంలో ఆయనే హీరోగా నటిస్తుండగా, జ్యోతి పూర్వజ్ హీరోయిన్‌గా నటిస్తోంది.

విశాల్‌రాజ్, దశరథ, చందూ, గౌతమ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఉర్వీష్ పూర్వజ్ సమర్పణలో ఏయూ అండ్ ఐ, మెర్జ్ ఎక్స్‌ఆర్ సంస్థతో కలిసి థింక్ సినిమా బ్యానర్‌పై పూర్వజ్ ప్రజయ్ కామత్, ఏ పద్మనాభరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

మైథాలజీ, సైన్స్ ఫిక్షన్, సూపర్ హీరో లాంటి ఎలిమెంట్స్‌తో రూపొందుతున్న ఈ మూవీ అప్డేట్‌ను మేకర్స్ ఆదివారం పంచుకున్నారు. ఈ సినిమా పోస్ట్ ప్రొడ క్షన్ కార్యక్రమాలు తుదిదశకు చేరుకుంటున్నట్టు తెలిపారు. త్వరలోనే రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తామని పేర్కొన్నారు.