27-10-2025 12:55:42 AM
టాలీవుడ్ హీరో నారా రోహిత్ పెళ్లి సందడి మొదలైంది. ‘ప్రతినిధి2’ సినిమాలో రోహిత్ తనతో కలిసి నటించిన శిరీషను మనువాడబోతున్న విషయం తెలిసిందే. ఈ నెల 30న ఈ జంట ఏడడుగుల బంధంతో ఒక్కటి కానున్నారు.
గురువారం రాత్రి 10.35 గంటలకు హైదరాబాద్‌లో జరగనుంది. పెళ్లి తంతులో భాగంగా నిర్వహించే తొలి ఘట్టం హల్దీ వేడుక శనివారం పూర్తయింది. కుటుంబ సభ్యులు, ఆత్మీయులు ఈ వేడుకకు హాజరయ్యారు. ఇందుకు సంబంధించి ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట సందడి చేస్తున్నాయి.