27-08-2025 12:08:45 AM
-అడ్డు అదుపు లేకుండా మట్టి రవాణా...
-చోద్యం చూస్తున్న అధికారులు
మంచిర్యాల, ఆగస్టు 26 (విజయక్రాంతి) : మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి మండలంలో విచ్చలవిడిగా మట్టి దందా కొనసా గుతోంది. ఇందిరమ్మ ఇండ్లకు మట్టి తరలిం పు పేరిట ప్రైవేటుగా అమ్ముకుంటూ లక్షల దండుకుంటున్నారు మట్టి మాఫియా నిర్వాహకులు.
భారీ వాహనాలతో మట్టి పరిమితి కి మించి తరలిస్తుండటంతో రోడ్లు సైతం చెడిపోతున్న అధికారులు అటువైపు చూసిన పాపాన పోలేదు... స్వయంగా గ్రామస్తులే ఆ వాహనాలను అడ్డుకొని అధికారులకు స మాచారం అందించినా ఈసమంత కూడా చలనం రాకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది. పట్ట పగలే మట్టి మాఫియాను సం బంధిత శాఖ అధికారులు దగ్గరుండి ప్రోత్సహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
దండేపల్లి మండలం నెల్కి వెంకటాపూర్ గ్రామ సమీప కొండలు మట్టి మాఫియా చేతిలో పడి మాయమైతున్నాయి. ఓ వైపు మట్టి తరలించేందుకు అనుమతులు లేవని అధికారులు చెబుతున్నారే కానీ తరలిస్తున్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. రాత్రిపగలు అనే తేడా లేకుండా భారీ వాహనాలతో కొంతమంది ముఠాగా తయారై పెద్ద మొత్తంలో మట్టిని తరలిస్తున్నారు.
అనుమతి ఇందిరమ్మ ఇండ్లకు..
ఇందిరమ్మ ఇళ్లకు మట్టి పేరిట అనుమతులు తీసుకొని మట్టి ప్రైవేట్ వ్యక్తులకు ఇష్టారాజ్యంగా అమ్ముకుంటున్నారు. దండేపల్లి మండలం వెంకటపూర్ గోండ్ గూడ నుంచి మేదరి పేట, మాదాపూర్, ముత్యంపేట్ చెక్ పోస్ట్ దగ్గర ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించిన ప్లాట్ లకు, వెంచర్లకు ఈ మట్టిని తరలిస్తున్నారు. ఒక్కో ట్రిప్పు కు వేల రూపాయలు వసూలు చేస్తూ లక్షలు దండుకుంటున్నారు... ఇప్పటికైనా ఉన్నతా ధికారులు ఈ మాఫియాని అడ్డుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ఎవరు బాగు చేయిస్తారు...
పరిమితికి మించి అక్రమంగా భారీ వాహనాల ద్వారా మట్టిని తరలించడంతో ద్వంసమయిన రోడ్డును, మిషన్ భగిరథ పైపులను ఎవరు బాగు చేయిస్తారని గ్రామ ప్రజలు ప్రశ్నిస్తున్నారు... వీటిని గుత్తెధారు బాగుచేస్తారా..! లేదా ఆధికారులు బాగు చేస్తారా..! అని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ధ్వంసమయిన రోడ్డు, మిషన్ భగిరథ పైపులు బాగు చేసేవరకు సోలార్ ప్లాంట్ పనులు ఆపాలని వేంకటపూర్ గోం డ్ గూడ గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నా రు. సోమవారం భారీ వాహనాలను ఆపి మరి నిర సన వ్యక్తం చేశారు. అధికారులు ఆమ్యామ్యాలకు ఆశపడకుండా అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.