27-08-2025 12:00:00 AM
ఎల్బీనగర్, ఆగస్టు 26 : పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించి, పూజించాలని హస్తినాపురం కార్పొరేటర్ బానోతు సుజాత నాయక్ కోరారు. జిహెచ్‌ఎంసి ఆధ్వర్యంలో ప్రజలకు మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మట్టి విగ్రహాలను పూజిస్తూ ప్రజలందరూ వినాయకుని నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలన్నారు. కార్యక్రమంలో నాయకులు చంద్రమోహన్ రెడ్డి, మల్లారెడ్డి అనంతరెడ్డి, నర్సింహారెడ్డి, నరేశ్, శ్రీనివాస్ గౌడ్, నర్సింహ, డేరంగుల కృష్ణ, గోపిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
పర్యావరణాన్ని కాపాడాలి
గడ్డిఅన్నారం డివిజన్ పరిధిలోని పీ అండ్ టీ కాలనీలో భరత్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో వాసవి ఫార్మా & సర్జికల్స్ సహకారంతో స్థానికులకు మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. గణేశ్ నిమజ్జనాల వల్ల పర్యావరణానికి హాని కలగకుండా మట్టి విగ్రహాల వినియోగాన్ని ప్రోత్సహించాల న్నారు. పర్యావరణ పరిరక్షణ కార్యక్ర మాలను ప్రోత్సహించాలని సూచిం చారు. కార్యక్రమంలో భరత్ హ్యూ మన్ రైట్స్ ఆర్గనైజేషన్ ప్రతినిధులు, వాసవి ఫార్మా అండ్ సర్జికల్స్ సభ్యులు, బీజేపీ సీనియర్ నాయకులు హైందవి రెడ్డి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
మట్టి గణపతులను పూజిద్దాం రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్
ఛైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి
తలకొండపల్లి, ఆగస్టు 26: వినాయక చవితి సందర్భంగా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో తయారుచేసిన వినాయక విగ్రహల ఏర్పాటు వల్ల పర్యావరణానికి తీవ్ర హాని జరుగుతుందని, పర్యావరణ పరిరక్ష ణలో భాగంగా ప్రతి ఒక్కరూ మట్టి గణపతులను ప్రతిష్టించి పూజించాలని తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ ఛైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ హితం కోరేవారందరు మట్టితో తయారు చేసిన వినాయక ప్రతిమలను ఏర్పాటు చేయాలని కోరారు.ఈ విషయమై మనలో ప్రతి ఒక్కరు మట్టి గణపతి ప్రతిమల ఏర్పాటుపై విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు.ఇలాగైన కొంతమేరకైన పర్యవణ హితం కొరినవారమౌతామని ఆశాభావం వ్యక్తం చేశారు.మన పండుగలలోని పరమార్థం మన ఆరోగ్యం,ప్రకృతిని కాపాడుకోవడమేనని శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.