calender_icon.png 4 November, 2025 | 8:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రవితేజతో ఆటపాటల్లో బిజీ..

04-11-2025 01:15:25 AM

రవితేజ ‘మాస్ జాతర’ ఇప్పుడు థియేటర్లలో సందడి చేస్తోంది. ఆయన హీరోగా నటించిన 75వ సినిమా ఇది. ఈ చిత్రంపై మిశ్రమ స్పందన దక్కుతోంది. అయితే, మాస్ మహారాజా ప్రస్తుతం ఈ విమర్శలేవీ పట్టించుకోకుండా తన 76వ సినిమా కోసం రంగంలోకి దిగిపోయారు. దర్శకుడు కిషోర్ తిరుమల దీన్ని రూపొందిస్తున్నారు. ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. సోమవారం నుంచి టీమ్ ఒక పాట చిత్రీకరణ పనులను ప్రారంభించింది.

నాయకానాయికలు రవితేజ, ఆషికా రంగనాథ్‌లపై షూట్ చేస్తున్న ఈ పాట కోసం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్‌లో ప్రత్యేకమైన సెట్ వేశారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో రూపొందుతున్న ఈ పాట అదిరిపోయే డ్యాన్స్ నంబర్‌గా ఉండనుందని యూనిట్ పేర్కొంది. భావోద్వేగభరితమైన కథలతో అలరించే దర్శకుడు కిశోర్ తిరుమల ఈ చిత్రాన్ని అన్నివర్గాల ప్రేక్షకుల ఆకట్టుకునేలా తీర్చిదిద్దుతున్నారు.

ఇది హ్యూమర్, ఎమోషన్, రవితేజ మాస్ ఎలిమెంట్స్‌తో పూర్తి కుటుంబ కథాచిత్రంగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో రవితేజ సరికొత్తగా స్టైలిష్ లుక్‌లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి భీమ్స్ సెసిరోలియో స్వరాలు సమకూర్చుతుండగా,  ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రాఫర్‌గా, శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్‌గా, ఏఎస్ ప్రకాశ్ ఆర్ట్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.