calender_icon.png 22 November, 2025 | 2:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిర్మల్ కలెక్టర్‌కు ఎమ్మెల్యే సన్మానం

22-11-2025 02:00:04 AM

నిర్మల్, నవంబర్ 21 (విజయక్రాంతి): జలసంచాయ్- జనభాగీదారీ అవార్డును జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, ఇటీవలి న్యూఢి ల్లీలో కేంద్ర జల శక్తి మంత్రి సి.ఆర్. పాటిల్ చేతుల మీదుగా స్వీకరించినందున, శుక్రవా రం కలెక్టరేట్లోని తన చాంబర్లో ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. శాలువాతో సన్మానించి, పుష్పగుచ్చాన్ని అందజేశారు. జిల్లాకు ప్రతి ష్టాత్మకమైన అవార్డు రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. డిఆర్డిఓ విజయలక్ష్మిని ఎమ్మె ల్యే సన్మానించి, అభినందించారు. అంతకు ముందు పలువురు ఎంపీఓలు, పంచాయతీ కార్యదర్శులు కలెక్టర్ ను సన్మానించారు.