07-05-2025 12:44:23 AM
గృహ నిర్మాణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వీ.పీ గౌతమ్
వికారాబాద్, మే 6: అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అయ్యేలా జాబితాలను రూపొందించాలని గృహ నిర్మాణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వి.పీ.గౌతం అధికారులను ఆదేశించారు.మంగళవారం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక, ధ్రువీకరణ ప్రక్రియపై జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తో కలిసి ప్రత్యేక అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడిఓ, ధ్రువీకరణ గెజిటెడ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
ఈ సందర్భంగా మేనేజింగ్ డైరెక్టర్ గౌతం అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ...రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు అర్హులైన పేదలకు చెందాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల కమిటీ ద్వారా వచ్చిన జాబితాలను క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించి కుటుంబాల స్థితిగతులను పరిశీలించి పారదర్శకంగా జాబితాలను రూపొందించాలని ఆయన అధికారులకు సూచించారు.
దారిద్య్రరేఖకు దిగువన ఉన్న పేదలకు ప్రాధాన్యత క్రమంలో ఇందిరమ్మ ఇళ్లను ఎంపిక ప్రక్రియను చేపట్టాలని ఆయన అధికారులకు సూచించారు.కలెక్టరేట్ నుండి వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ సుధీర్, హౌసింగ్ పి డి క్రిష్ణయ్య, డీఆర్ డిఓ శ్రీనివాస్, డీఎస్ హెచ్‌ఓ సత్తార్, హౌసింగ్ డిఇ, ఎఇ లు పాల్గొన్నారు.