calender_icon.png 7 May, 2025 | 4:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజీవ్ యువ వికాస పథకానికి సిబిల్ నిబంధన తొలగించాలి

07-05-2025 12:42:52 AM

బీఎస్పీ సిద్దిపేట నియోజకవర్గ అధ్యక్షుడు పుల్లూరు ఉమేష్

సిద్దిపేట, మే 6 (విజయక్రాంతి): నిరుద్యోగుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన రాజీవ్ వికాసం పథకంలో సిబిల్ తప్పనిసరి  చేయడం చాలా దారుణమని బీఎస్పీ సిద్ధిపేట నియోజకవర్గ అధ్యక్షుడు పుల్లూరు ఉమేష్ అన్నారు. మంగళవారం సిద్దిపేట ప్రెస్ క్లబ్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో పుల్లూరు ఉమేష్ మాట్లాడారు.

స్వయం ఉపాధి కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకం లక్ష్యం చేరకుండా డబ్బులు సృష్టించడం దారుణమన్నారు. ప్రైవేట్ బ్యాంకుల మాదిరిగా సిబిల్ ను కంపల్సరీ చేయడం ద్వారా యువత తీవ్రంగా నష్టపోతుందని తెలిపారు. దేశాన్ని దోచుకొని వందల కోట్లు ఎగ్గొట్టే బడా కార్పోరేటర్లకు లేని నిబంధనలు నిరుద్యోగోలకు ఎందుకనీ ప్రశ్నించారు.

తక్షణమే సిబిల్ నుండి యువతకు మినహాయింపు ఇవ్వకుంటే బహుజన్ సమాజ్ పార్టీ దీనిపైన పెద్ద ఎత్తున నిరసన, ధర్నా కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు. సిద్దిపేట జిల్లాలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కలెక్టర్ అప్రూవల్ పొంది ఈ పేమెంట్ సెక్షన్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో పెండింగ్ ఉన్న  400 మంది బాధితులకు అప్రూవల్ అయిన అప్లికేషన్లను రిజెక్ట్ చేయడం దేనికి నిదర్శనమని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు ఈర్ల మల్లేశం ముదిరాజ్, అసెంబ్లీ ఇన్చార్జి పంగబాబు , అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి కాతా మహేష్,  సిద్ధిపేట పట్టణ అధ్యక్షుడు ప్రసాద్, నంగునూరు మండల అధ్యక్షుడు ముండ్రాతి లింగం, చిన్నకోడూరు మండల అధ్యక్షుడు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.