27-10-2025 12:45:23 AM
-ఫైనల్లో ఓడిన ముంబై
-ప్రైమ్ వాలీబాల్ లీగ్ సీజన్ 4
హైదరాబాద్, అక్టోబర్ 26 : ఆర్‌ఆర్ కేబుల్ ప్రైమ్ వాలీబాల్ లీగ్ నాలుగో సీజన్‌లో బెంగళూరు టార్పెడోస్ చాంపియన్‌గా నిలిచింది. ఫైనల్లో బెంగళూరు 3 సెట్ల తేడాతో ముంబై మీటియర్స్‌ను ఓడించింది. లీగ్ స్టేజ్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన ఈ రెండు జట్ల మధ్య టైటిల్ పోరు అభిమానులను అలరించింది.
ముంబై అనవసర తప్పిదాలు బెంగళూరుకు అడ్వాంటేజ్‌గా మారాయి. ఇక మూడో సెట్‌లో జలెన్ పెన్రోస్ ఎంట్రీతో బెంగళూరు వరుస స్పైక్‌లతో చెలరేగిపోయింది. శుభమ్ చౌదరి ఎటాకింగ్‌తో ముంబై పుంజుకునేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీం తో బెంగళూరు టార్పెడోస్ తొలిసారి ప్రైమ్ వాలీబాల్ లీగ్‌లో టైటిల్ సొం తం చేసుకుంది.
జిష్టు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గానూ, ఓం లాడ్ వసంత్ ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్, జోయెల్ బెంజిమన్(చెన్నై బ్లిట్జ్) మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవార్డును సొం తం చేసుకున్నాడు. చాంపియన్‌గా నిలిచిన బెంగళూరు రూ.40 లక్షలు, రన్నరప్ టీమ్ ముంబై రూ.30 లక్షల ప్రైజ్‌మనీ దక్కింది.