calender_icon.png 19 September, 2025 | 3:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చినుకులతో కాసేపు!

15-09-2025 12:00:00 AM

వానకు భలే ఇష్టం

పిల్లలతో ఆడి పాడాలని!

చిన్నారులకూ భలే ఇష్టం

చినుకులతో కాసేపు 

చిందులేయాలని !

తలచిందే తడవు

తడిపేసింది వాన!

బడి మైదానాన్ని

ఆడుకుంటున్న పిల్లల్ని

కలిసి పోయారు

పాలూ నీళ్లలా, పిల్లలూ వాన

తడిసిన గులాబీలు

పసి నవ్వులు

మెరిసిన ముత్యాలు

వాన చినుకులు

కలబోసిన ఇద్దరి ఆటా పాటా

కమనీయపు తెలుగు పాట

బడి గంట మ్రోగింది !

పిల్లల్లారా ! రారండని..

గొంతెత్తి పిలిచాయి

తరగతి గదులు..

వాననొదిలి పరిగెత్తారందరూ!

పిల్లలపై మమకారంతో

బొట్లు బొట్లుగా రాలుతూ

తరగతి గది వరకూ

తోడొచ్చింది తడబడుతూ వాన