calender_icon.png 19 September, 2025 | 2:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అసంకల్పిత వాక్యాలు

15-09-2025 12:00:00 AM

ఇప్పటికిప్పుడు నీ గాయాలను మానిపే  ఒక మాటో కవితా వాక్యమో దొరక్క పోవచ్చు అసలది గాయమన్న స్పృహ కూడా లేకుండా

సలపరమో.. వలపరమో ?

తెలుసా.. !

కొన్ని పూలు గాయపరుస్తాయి

ఇంకొన్ని మంచు బిందువులు విచ్చుకత్తులవుతాయి

మచ్చుకి ఇవే అవి అని చూపలేము..

కావురు పట్టిన అద్దంలా దృశ్యం అస్పష్టం

చుట్టూ పూల బొకేల్లా

కవితా సంపుటాలు ఎన్ని హృదయాల ద్రవ కంపనాలివి

ఒక్కటంటే ఒక్క వాక్యము బాధకు భాష్యం చెప్పలేదు..

ఎప్పుడు? ఎక్కడ?

ఒక్క కన్నీటి బొట్టు రాలలేదు

ఎద వాకిట్లో రాలే పూలనెప్పుడు

లెక్కించే గణితం ఎవరు ఇంకా కనిపెట్టలేదు.