calender_icon.png 2 September, 2025 | 12:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అరుదైన వ్యాధికి మెడికవర్ హాస్పిటల్ లో శస్త్ర చికిత్స

01-09-2025 07:53:02 PM

పేషెంట్ చేయి, ప్రాణాలు కాపాడిన వైద్యులు

హనుమకొండ (విజయక్రాంతి): వరంగల్ మెడికవర్ హాస్పిటల్(Medicover Hospitals)లో అరుదైన శస్త్ర చికిత్సతో వైద్య నిపుణులు పేషెంట్ చెయి కాపాడారని మెడికవర్ హాస్పిటల్ లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. మొగుళ్లపల్లి మండలానికి చెందిన తిరుపతి అనే వ్యక్తి బ్రెయిన్ స్ట్రోక్ కి గురై ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందిన అనంతరం డిశ్చార్జ్ అయ్యారు. ఇంటికి చేరిన రోజే అతనికి కుడి చేయిలో విపరీతమైన నొప్పి రావడంతో స్థానికంగా ఉన్న డాక్టర్ ను సంప్రదించారు. డాక్టర్ పరీక్షించి, రక్త ప్రసరణ ఆగిపోవడం గమనించారు. అక్కడి నుండి వారు మెడికవర్ హాస్పిటల్ చేరుకుని, డాక్టర్లు కన్సల్టెంట్ కార్డియోథరాసిక్ వ్యాస్కులర్ సర్జన్ రవి కిరణ్, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ ప్రియాంక అత్యవసరంగా పరీక్షలు చేసి కుడి చేయి బ్రెచియల్ ఆర్టరిస్(చేతి ప్రధాన ధమని), రేడియల్(మణి కట్టు-ముంజేతి), ఉల్నర్ నాడి థ్రోమ్బోసిస్ ఏర్పడినట్లు గుర్తించారు. వెంటనే అర్తెరిల్ థ్రోమ్బోక్టమి శస్త్ర చికిత్స చేసి రక్త గడ్డలను తొలగించి, రక్త ప్రసరణను పునరుద్ధరించారు. సమయానికి చికిత్స అందించడంతో పేషెంట్ చేయి కాపాడగలిగారని తెలిపారు.

ఈ సమయంలో పేషెంట్ కి కుడి కన్నులో చూపు మందగించడం కూడా గమనించబడిందని, కంటి వైద్యులు చేసిన టెస్టుల్లో కంటి నరానికి సంబంధించిన రక్తనాళాల్లో కూడా రక్త గడ్డలు ఉన్నట్లు తేలిందన్నారు. తదుపరి పరీక్షల్లో, ఆయన బ్రెయిన్ స్ట్రోక్, బహుళ రక్త గడ్డల ఆంటీ ఫోస్పో లిపిడ్ సిండ్రోమ్ (ఎ పి ఎల్) వ్యాధి అని గుర్తించారు. ఈ వ్యాధి వల్ల రక్తం సులభంగా గడ్డ కట్టే అవకాశం ఎక్కువగా ఉంటుందని, దీని కోసం కూడా తగిన చికిత్స ప్రారంభించామని చెప్పారు. పేషెంట్ తిరుపతి మాట్లాడుతూ  సమయానికి హాస్పిటల్ కి వచ్చానని డాక్టర్లు తగు విధంగా ట్రీట్మెంట్ చేసి నా చేయిని, ప్రాణాలను కాపాడారని కృతజ్ఞతలు తెలిపారు.