calender_icon.png 2 September, 2025 | 2:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తప్పని పడిగాపులు

02-09-2025 12:00:00 AM

  1. యూరియా కోసం కొనసాగుతున్న బారులు 
  2. పలుచోట్ల రైతుల నిరసనలు
  3. మానుకోటలో రహదారుల దిగ్బంధం 
  4. కేసముద్రంలో తొక్కిసలాట

మహబూబాబాద్, సెప్టెంబర్ 1 (విజయక్రాంతి)/బెజ్జంకి/యాచారం: యూరియా కోసం రోజుల తరబడి తిరుగుతున్నా దొరకకపోవడంతో రైతులు ప్రభుత్వాలపై మండిప డుతున్నారు. సోమవారం మహబూబాబా ద్ జిల్లా కేంద్రంతో పాటు మరిపెడ, కురవి, కేసముద్రం మండల కేంద్రాల్లో అన్నదాత లు రాస్తారోకో నిర్వహించారు. ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు కేసముద్రం రైతు వేదిక వద్ద వందలాది మంది రైతులు టోకెన్ల కోసం నిరీక్షించారు.

ఏవో వెంకన్న, ఎస్‌ఐ మురళీధర్‌రాజ్ ఆధ్వర్యంలో టోకెన్ల పంపిణీ చేపట్టగానే ఒక్కసా రిగా తోపులాట జరిగింది. ఈ క్రమంలో యూరియా బస్తాల కోసం ముందు వరస లో ఉన్న మహిళలు చాలామంది కింద పడ్డా రు. ఈ ఘటనలో బేరువాడకు చెందిన అని త అనే మహిళా రైతు కాలుకు గాయమైంది. మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి. క్యూ పద్ధతి కోసం ఏర్పాటుచేసిన భారీ కేడ్లు తొలగించి మరీ రైతులు ఒక్కసారిగా రైతు వేదిక వద్దకు దూసుకెళ్లారు.

దీంతో పోలీసులు కూడా ఏం చేయలేక చేతులెత్తేశారు. తోపులాట తీవ్ర స్థాయికి చేరుకొని ఏకంగా కొందరు రైతు వేదిక భవనం పైకి చేరి కిటికీల ద్వారా టోకెన్లు తీసుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది. మరిపెడలో సోమవారం యూరి యా ఇస్తామని చెప్పి శుక్ర, శనివారం టోకె న్లు ఇచ్చి ఇప్పుడు వస్తే యూరియా మంగళవారం వస్తుందని చెప్పడంతో ఏవో నిర్లక్ష్యం వల్ల తమకు యూరియా సకాలంలో  అంద ని పరిస్థితి ఏర్పడిందని పెద్ద ఎత్తున రైతులు ఖమ్మం వరంగల్ జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.  సీఐ రాజ్‌కుమార్‌గౌడ్, ఎస్‌ఐ సతీ ష్ నచ్చజెప్పి రైతులను శాంతింపజేశారు.

కురవి మండల కేంద్రం వద్ద మహబూబాబాద్ మరిపెడ జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఇదే తరహాలో జిల్లా కేంద్రంలో సైతం రాస్తారోకో నిర్వహించారు. కేసముద్రంలో టోకెన్లు పొందలేకపోయిన వారికి టోకెన్లు ఇవ్వాలంటూ రాస్తారోకో నిర్వహించారు. కాగా ఇప్పటివరకు టోకెన్లు, కూపన్ల ద్వారా యూరియా పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు.

అయితే ఈ పద్ధతి పెద్దగా సత్ఫలితాలు ఇవ్వకపోవడంతో మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వుతై కుమార్ సింగ్ నేరుగా రైతులకు యూరియా పంపిణీ చేయడానికి చర్యలు చేపట్టారు. మంగళవారం నుండి వ్యవసాయ శాఖ ద్వారా ఆన్లున్లో ఉన్న  రైతు పట్టా పాస్ పుస్తకం నెంబర్ ఆధారంగా ఒక్కో రైతుకు ఒక్కో బస్తా చొప్పున పంపిణీ చేయనున్నారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకిలో తెల్లవారు నుంచే రైతులు క్యూ కట్టారు. రం గారెడ్డి జిల్లా యాచారంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులు సొసైటీలు, రైతు వేదికల వద్ద బారులు తీరారు. 

పోలీసుల బందోబస్తు మధ్య పంపిణీ 

కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలోని మాచారెడ్డి, పెద్ద మల్లారెడ్డి, రాజంపేట, తాడువాయి, బిక్కనూర్, సదాశివ నగర్ మండల కేంద్రాల్లోని విండో కార్యాలయాల ఎదుట రైతులు యూరియా కోసం బారులు తీరారు. భిక్కనూరు మండలం పెద్ద మల్లారెడ్డి సింగల్ విండో కార్యాలయం ఎదు ట సోమవారం ఉదయం నుంచి రైతులు బారులు తీరారు.

రైతులకు సరిపడా యూరి యా స్టాకు లేదని లేదని విండో అధికారులు చెప్పడం రైతులను తీవ్ర ఆందోళనకు దిగా రు.  తాడ్వాయి, భిక్కనూర్, మాచారెడ్డి, రాజంపేట, ఎర్ర పహాడ్, తదితర విండోల లో యూరియా తగినంత  స్టాక్ లేక రైతులు ఇబ్బందులుపడుతున్నారు. సదాశివ నగర్‌లో రైతులు ఫర్నిచర్ ధ్వంసం చేశారు. 

కాగజ్‌నగర్‌లో ఉద్రిక్తత

కాగజ్‌నగర్: కాగజ్‌నగర్ మార్కెట్ కార్యాలయం ఎదుట యూరియా కోసం రైతుల ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా రైతు లు మాట్లాడుతూ డీలర్లు యూరియా బ్యా గు రూ.700 నుంచి రూ.800 లకు బ్లాక్ మార్కెట్లో విక్రయాలు జరుపుతున్నట్లు ఆరోపించారు. గత నెల రోజుల క్రితమే  రైతులకు వ్యవసాయ అధికారులు యూరియా కోసం టోకెన్లు జారీ చేసినప్పటికీ, రేపు మాపు అం టూ కాలయాపన చేస్తున్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

యూరియా కోసం అధి కారులను ఆశ్రయిస్తే స్టాకు లేదంటూ సమాధానం ఇస్తున్నట్టు చెప్పారు. డీలర్ల వద్ద మాత్రం యూరియా నిల్వ ఉండటంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మార్కె ట్లో మాత్రం అధిక ధరలకు యూరియాను బహిరంగంగా విక్రయిస్తున్నప్పటికీ అధికారులు కనీసం తనిఖీ చేసిన దాఖలాలు లేవ న్నారు. అధికారులు తక్షణమే స్పందించి కేటాయించిన యూరియాను తక్షణం తమకు అందజేయాలని డిమాండ్ చేశారు. 

రాజీవ్ రహదారిపై రాస్తారోకో..

కొండపాక: యూరియా కోసం రైతులు రోడ్డెక్కారు. సిద్దిపేట జిల్లా కొండపాక  మండల కేంద్రంలో సోమవారం ఆందోళన నిర్వహించారు. కొండపాక క్రాస్ రోడ్డు వద్ద రాజీవ్ రహదారిపై రాస్తారోకో చేశారు. సోమవారం తెల్లవారు నుంచే రైతులు పడిగాపులు కాశారు.

తీరా యారియా రావడం లేదని అధికారులు చెప్పడంతో ఆగ్రహించిన రైతులు ఆందోళన చేపట్టారు. కొండపాక లో రైతుల ఆందోళలనలకు బీఆర్‌ఎస్ నాయకులు మద్దతు తెలిపారు. వెలికట్ట క్రాస్ రోడ్ వద్ద గల ఆగ్రోస్‌లో యూరియా ఉందని తెలియడంతో వ్యవసాయ శాఖ అధికారి శివరామ కృష్ణ చేరుకుని రైతులకు టోకెన్‌లు ఇచ్చి యూరియా అంది ంచారు.