01-09-2025 11:48:16 PM
తూప్రాన్,(విజయక్రాంతి): జరగబోయే మిలాద్-ఉన్-నబీ పురస్కరించుకొని ముస్లిం సహోదరులతో సమావేశం ఏర్పాటు చేసిన సిఐ రంగకృష్ణ. ముఖ్యంగా గణేష్ విగ్రహాల నిమజ్జనం అదే సమయంలో జరుగనున్న కారణంగా, ఇరు వర్గాల వేడుకలు శాంతియుత వాతావరణంలో సమన్వయంతో కొనసాగడానికి ఇరు వర్గాల మతాల పెద్దలు సహకరించాలని సూచనప్రాయంగా తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ యంత్రాంగానికి కులాలకు మతాలకు అతీతంగా సహకరించాలన్నారు.
అంతేకాకుండా ముస్లిం పెద్దలకు సెప్టెంబర్ 14న మిలాద్-ఉన్-నబీ జరుపుకోవాలని మర్యాద పూర్వకంగా వివరించారు. ఈ ప్రతిపాదనను అంగీకరించి సహకరించడానికి ఇరువర్గాల వారు హామీ ఇచ్చారన్నారు. రెండు సమాజాల కార్యక్రమాలు సమన్వయంతో సౌహార్ద వాతావరణంలో జరగే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు.