calender_icon.png 2 September, 2025 | 2:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పింఛన్ల పంపిణీ సక్రమంగా చేపట్టాలి: ఎంపీడీవో రాజేశ్వర్

01-09-2025 11:51:58 PM

మందమర్రి,(విజయక్రాంతి): మండలంలోని వివిధ గ్రామపంచాయతీలలో పోస్ట్ ఆఫీస్ ల ద్వారా పంపిణీ చేస్తున్న పింఛన్లను సక్రమంగా పంపిణీ చేయాలని మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎన్.రాజేశ్వర్ అన్నారు. సోమవారం మండలంలోని పులిమడుగు గ్రామ పంచాయతీలో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఆధ్వర్యంలో చేపట్టిన పింఛన్ల పంపిణీని ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పింఛన్ల పంపిణీలో ఎలాంటి అవకతవ కలు జరగకుండా పూర్తి పారదర్శకంగా లబ్ధిదారులకు పంపిణీ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి సురేష్  పాల్గొన్నారు.