calender_icon.png 2 September, 2025 | 2:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాళేశ్వరంపై కాంగ్రెస్ కుట్రలను తిప్పికొడతాం

02-09-2025 12:00:00 AM

  1. చంద్రబాబు, బీజేపీ డైరెక్షన్లో కేసీఆ్ప రేవంత్ రెడ్డి కుట్ర
  2. ప్రజాక్షేత్రంలో రేవంత్ రెడ్డికి తగిన గుణపాఠం తప్పదు
  3. బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు
  4. బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో పట్టణంలో  రాస్తారోకో, నిరసన  

మణుగూరు, సెప్టెంబర్ 1 (విజ య క్రాంతి) : రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్పై కుట్ర చేస్తున్నదని బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆరోపించారు  కాళేశ్వరం ప్రాజెక్ట్పై విచారణను రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకు అప్పగిండాన్ని తీవ్రంగా నిరసిస్తూ పార్టీ శ్రేణులతో కలిసి సోమవారం  మండల కేంద్రంలో నల్ల బ్యాడ్జీలతో భారీ మోటార్ సైకిల్ ర్యాలీ చేపట్టారు.  అంబేద్కర్ సెంటర్ లో  ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపి రాస్తారోకో నిర్వహించారు.

ఈ సందర్భంగా కాంతారావు  మాట్లాడుతూ.. తెలంగాణ వరప్రదా యిని కాళేశ్వరం ప్రాజెక్ట్ను శాశ్వతంగా మూ సేసి, నదీ జలాలను ఆంధ్రాకు తరలించేందుకు సీఎం రేవంత్ కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. సీబీఐకి కాళేశ్వరం అప్పజెప్పడం అంటే ప్రాజెక్ట్ను పూర్తిగా మూసే యడమే అన్నారు. నిన్నటిదాకా సీబీఐ పైన వ్యతిరేకంగా మాట్లాడి న రేవంత్ రెడ్డి ఒక్క రోజులోనే మాట ఎందుకు మార్చారని ప్రశ్నించారు. 

దీని వెనుక ఉన్న శక్తులు, వాటి ఉద్దేశాలేమిటో ప్రజలకు తెలపాలని డిమాండ్ చేశారు. తెలంగాణ నదీ జలాలను పక్క రాష్ట్రాలకు తరలించి, కాళేశ్వరాన్ని ఎండ బెట్టే ప్రయత్నంలో భాగంగానే జరుగుతున్న కుట్ర అని, కాంగ్రెస్, బీజేపీ ఆడుతున్న నాటకమని, వారి  కుట్రలను ఎదుర్కోవాల న్నారు. సీఎం రేవంత్, చంద్రబాబు, బీజేపీ డైరెక్షన్లో కేసీఆర్ పై కుట్ర చేస్తున్నట్లు దుయ్యబట్టారు. కాళేశ్వరం పై ఎలాంటి అవినీతి జరగలేదన్నారు.

కేసీఆర్‌పై విచారణ అంటేనే తెలంగాణ రైతాంగాన్ని అవమానించట మే నన్నారు. తెలంగాణ కోసం చావు నోట్లో తలపెట్టి పోరాడిన కేసీఆర్ పై కుట్రలు చేస్తే ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు. కమిషన్ నివేదిక పై మాట్లాడేందుకు సమ యం ఇవ్వకుండా ప్రభుత్వం గొంతు నొక్కిందన్నారు. ప్రజలంతా గమనిస్తున్నారని, ప్రజాక్షేత్రంలో రేవంత్ రెడ్డికి తగిన   గుణపాఠం తప్పదని హెచ్చరించారు.  బీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కుర్రి  నాగేశ్వరరావు, పార్టీ శ్రేణులు, అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.