01-09-2025 11:55:03 PM
పాపన్నపేట: పంట నష్టం జరిగిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రైతులకు భరోసానిచ్చారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నీట మునిగిన పంటలను సోమవారం ఎమ్మెల్యే రోహిత్ పరిశీలించారు. మండల పరిధిలోని గాంధారి పల్లి సహ పలు గ్రామాల్లో పర్యటించి రైతులకు భరోసానిచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్ మాట్లాడుతూ... అధికారులతో మాట్లాడి జరిగిన పంట నష్టానికి నష్టపరిహారం చెల్లించే విధంగా చర్య తీసుకుంటానని, రైతులెవరు అధైర్యపడొద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు.