calender_icon.png 30 December, 2025 | 2:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడు నాగోబా జాతరపై సమావేశం

30-12-2025 12:00:00 AM

కేస్లాపూర్‌లో కలెక్టర్ అధ్యక్షతన నిర్వహణ

ఉట్నూర్, డిసెంబర్ 29 (విజయక్రాంతి): ఆదివాసీల ఆరాధ్యదైవం నాగోబా జాతర ఏర్పాట్లపై జిల్లా అధికార యంత్రాంగం మంగళవారం సమావేశం కానుంది. నాగోబా జాతరపై ‘ఏటా తాత్కాలిక పనులేనా?’ శీర్షికతో ఈ నెల 26వ తేదీన ‘విజయక్రాంతిదినపత్రికలో ప్రత్యేక కథనం ప్రచురితమైంది. ఈ కథనానికి స్పందించిన జిల్లా అధి కార యంత్రాంగం మంగళవారం కేస్లాపూర్ నాగోబా దర్బారులో కలెక్టర్ రాజర్షిషా అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఐటీడీఏ అధికారులు, మెస్రం వంశం పెద్దలతో జాతర ఏర్పాట్లపై ఈ సమీక్ష సమావేశాంలో చర్చించానున్నారు. జాతర ఏర్పాట్లపై ‘విజయక్రాంతి‘ దినపత్రిక ప్రత్యేక కథనం రాయడంతో మెస్రం వంశస్థులు కృతజ్ఞతలు తెలిపారు.