calender_icon.png 30 December, 2025 | 1:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాగితాలకే దివ్యాంగుల చట్టం పరిమితం!

30-12-2025 12:29:27 AM

  1. ప్రతి స్కూల్‌లో సైకాలజిస్ట్, థెరపి సెంటర్లుండాలి
  2. ఎల్‌కేజీ నుంచే 5 శాతం ఉచిత సీట్లు ఇవ్వాలి
  3.   21 రకాల వైకల్యాలపై అవగాహన కల్పించాలి 
  4. శాసన మండలిలో డాక్టర్ దాసోజు శ్రవణ్ 

హైదరాబాద్, డిసెంబర్ 29 (విజయక్రాంతి): 2016 నాటి దివ్యాంగుల హక్కుల చట్టాన్ని (ఆర్పీడబ్ల్యూడీ చట్టం) కేవలం కాగితాలకే పరిమితం చేయకుండా, క్షేత్రస్థాయిలో పూ ర్తిస్థాయిలో అమలు చేయాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కోరారు. ప్రభుత్వం ఉన్నత విద్యలో 5 శాతం రిజర్వేషన్లు ఇస్తూ తీసుకున్న నిర్ణయం మంచిదే అయినా, అది కే వలం ఆరంభం మాత్రమేనని.. వేలాది కుటుంబాల కన్నీళ్లు తుడవాలంటే ఇంకా ఎంతో చే యాల్సి ఉందన్నారు.

సోమవారం శీతాకాల శాసనసభ సమావేశాల్లో భాగంగా శాసనమండలిలో ఆయన మాట్లాడారు. ఆటిజం, పక్ష వాతం సహా 21 రకాల వైకల్యాలపై యుద్ధ ప్రాతిపదికన గ్రామ స్థాయిలో అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. కేవలం కాలేజీల్లోనే కాదు ఎల్‌కేజీ నుంచే ప్రైవేట్ స్కూళ్లలో 5 శాతం ఉచిత సీట్లు ఇవ్వాలని కోరారు. ఆటిజం, పక్షవాతం వంటి 21 రకాల వైకల్యాల గురించి అవగాహన లేక, సరైన పరీక్షా కేంద్రాలు లేక సామాన్య, మధ్యతరగతి కుటుంబాలు ప్రైవేట్ సెంటర్ల చేతిలో మోసపోతూ ఆర్థికంగా చితికిపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రైవేట్ సెంటర్లలో వేల రూపాయలు ఖర్చు చేయలేని పేదల కోసం ప్రతి ప్రాంతంలో ప్రభుత్వ నిధులతో థెరపీ సెంటర్లు, కౌన్సిలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి పాఠశాలలో ఒక సైకాలజిస్ట్, స్పెషల్ ఎడ్యుకేటర్ ఉండాలని, అప్పుడు చిన్నప్పుడే లోపాలను గుర్తించి పిల్లలను సరిదిద్దే అవకాశం ఉంటుందన్నారు.

పేదరికం వల్ల ఏ ఒక్క దివ్యాంగ బిడ్డ చదువు ఆగకూడదని, వారికి 100 శాతం ఫీజు రాయితీ, స్కాలర్షిప్స్ అందించాలని, చట్టం సక్రమంగా అమలు అవుతుందో లేదో చూడటా నికి జిల్లా స్థాయిలో ఒక ప్రత్యేక కమిటీని వే యాలని, స్వచ్ఛంద సంస్థలు, వైద్యులతో కలిసి ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రతి బిడ్డకు గౌరవంగా బతి కే హక్కు ఉందని, వారి కి సమాన అవకాశాలు కల్పించినప్పుడే మనం బంగారు తెలంగాణను సాధించినట్లవుతుందన్నారు.