26-01-2026 01:05:44 AM
బిచ్కుంద, జనవరి 25 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని మున్నూరు కాపు సంఘం నాయకుల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావుకు పాలభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్నూరు కాపు సంఘ ఏర్పాటు కొరకు రెండు ఎకరాల స్థలం రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఎంతో సంతోషకరమైన విషయమని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం మున్నూరు కాపుల అభివృద్ధికి కృషి చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల సంఘం అధ్యక్షులు దర్పల్ సంతోష్, పార్టీ అధ్యక్షులు గంగాధర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సాయిని అశోక్, సోపాన్ సార్, దడిగి నాగ్నాథ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముందుకాపు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.