calender_icon.png 26 January, 2026 | 2:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇస్రో విజ్ఞాన యాత్రకు విద్యార్థుల ఎంపిక

26-01-2026 01:07:08 AM

తాడ్వాయి, జనవరి, 25( విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం కృష్ణాజివాడి ఉన్నత పాఠశాల కు చెందిన ఇద్దరు విద్యార్థులు ఇస్రో విజ్ఞాన యాత్రకు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామస్వామి తెలిపారు.

పాఠశాలకు చెందిన 10వ తరగతి విద్యార్థులు కుమ్మరి తరుణి, కుమ్మరి అక్షర లు ఎంపికైనట్లు ఆయన వివరించారు. ఈ నెల 28న కామారెడ్డి నుంచి ఇస్రోవిజ్ఞాన యాత్రకు బయలుదేరి వెళ్లనున్నారన్నారు. ఈ నెల 30న తిరిగి కామారెడ్డికి చేరుకుంటారన్నారని తెలిపారు. ఈ యాత్రలో పాఠశాల గైడ్ టీచర్స్ గిరి, శ్వేత లు పాల్గొంటారని ఆయన వివరించారు.