calender_icon.png 28 January, 2026 | 1:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈఎంఐతో తాకట్టు జీవితం!

20-01-2026 12:00:00 AM

ఆయా సర్వేల ప్రకారం భార్యాభర్తల మధ్య వచ్చే గొడవల్లో  70 శాతం ఆర్థిక కారణాలే ఉంటున్నాయి. అప్పుల భారం వల్ల కలిగే చికాకు కుటుంబంలో ప్రశాంతతకు దూరమై కుటుంబంలో గొడవలకు దారితీస్తోంది. వాయిదాల పద్ధతి సౌకర్యార్థం పుట్టిందే కావ చ్చు, కానీ అది జీవితాన్నే వాయిదాల పాలు చేయకూడదు. ఆర్థిక క్రమశిక్షణ లేని చోట స్వేచ్ఛా జీవనానికి చోటు ఉండదు.

నేటి ఆధునిక సమాజంలో మధ్యతరగతి మనిషి జీవనశైలి సమూ లంగా మారిపోయింది. ఒకప్పుడు అప్పు చేయడం తప్పు అని భావించిన చోట, నేడు అప్పు లేనిదే అడుగు పడదన్న పరిస్థితి నెలకొంది. నేటి మార్కెట్ వ్యవస్థ మనిషిని ‘ఇప్పుడే అనుభవించు, తర్వాత చెల్లించు’ అనే మాయాజాలంలో పడేసింది. ఒకప్పుడు మనిషి తన స్థాయిని బట్టి ఖర్చు చేసేవాడు, కానీ నేడు తన ‘క్రెడిట్ లిమిట్’ను బట్టి కల లు కంటున్నాడు.

ఈ క్రమంలో పుట్టుకొచ్చిన అతిపెద్ద ఆర్థిక మాయాజాలం ‘ఈఎం ఐ’ (ఇక్వీటెడ్ మంత్లీ ఇన్‌స్టాల్‌మెంట్ ). ఈఎంఐ అనే పదం పైకి ఆకర్షణీయంగా, సౌకర్యవంతంగా కనిపిస్తున్నప్పటికీ, లోతు గా పరిశీలిస్తే మధ్యతరగతి మనిషి తన వ్యక్తిగత, వృత్తిపరమైన స్వేచ్ఛను ఈ వాయిదాల పద్ధతికి తాకట్టు పెడుతున్నాడనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. మధ్యతరగతి జీ వితాల్లో ఈఎంఐ అనేది ఒక రెండంచుల కత్తి లాంటిది. నేటి మార్కెట్ వ్యవస్థలో మని షి పయనం ‘ఆశల పల్లకి.. అప్పుల ముళ్లబాట’ అన్నట్టుగా ఉన్నది. మధ్యతరగతి కల ల సౌధానికి ఈఎంఐ ఒక నిచ్చెనలా పనిచేస్తోంది. 

ఈ ప్రక్రియలో వస్తువు విలువ కం టే, ఆ వస్తువు ఇచ్చే సామాజిక హోదాకే ప్రాముఖ్యత పెరిగింది. పూ ర్వం ఒక వస్తువు కొనాలంటే డబ్బు దాచుకుని, అది చేతికి వచ్చే వరకు వేచి ఉండేవా రు. ఆ నిరీక్షణలో ఒక క్రమశిక్షణ ఉండేది. కానీ ఈఎం ఐలు వచ్చిన తర్వాత, కోరిక పుట్టిన క్షణమే వస్తువు చేతిలోకి వస్తోంది. దీనివల్ల మని షిలో ఓపిక నశించి, ఆర్థిక ప్రణాళిక పట్ల నిర్లక్ష్యం పెరుగుతోంది. సొంత ఇల్లు, కారు, పిల్లల ఉన్నత చదువులు, విదేశీ ప్రయాణాలన్నీ ఒక సాధారణ జీతగాడికి అసాధ్యమైన విషయాలుగా మిగిలిపోతున్న అంశాలు.

పొదుపు శూన్యం..

కానీ బ్యాంకులు ఇచ్చే రుణ సదుపాయం వీటిని సుసాధ్యం చేసింది. అయితే ఇక్కడే ఒక సూక్ష్మమైన వెలితి ఉంది. మన అవసరాల కంటే మన ఆశలు పెరిగిపోయినప్పుడు ఈఎంఐలు ఒక వ్యసనంగా మారిపోతున్నా యి. జీరో డౌన్ పేమెంట్‌లు, వాయిదా పద్దతుల వంటి ప్రకటనలు ఒక వస్తువుకు సం బంధించిన అసలు ధర విషయాన్ని మర్చిపోయేలా చేస్తున్నాయి. చిన్న చిన్న మొత్తా లుగా విడగొట్టడం వల్ల ఆ అప్పు భారంగా అనిపించదు.

కానీ అన్నీ కలిపి చూస్తే అది ఒక కొండంత అప్పుగా మారుతుంది. అవసరం లేకపోయినా ఐఫోన్ కొనడం, క్రెడిట్ కార్డు ఉంది కదా అని విలాస వస్తువులు సేకరించడం వల్ల నెలవారీ బడ్జెట్ తలకిందుల వుతోంది. మధ్యతరగతి వ్యక్తి ఆదాయంలో దాదాపు 50 నుంచి 60 శాతం కేవలం వాయిదాల చెల్లింపులకే వెచ్చిస్తున్నాడు. దీనివల్ల అతడు ఆర్థికంగా ఎదగడానికి అవసర మైన పొదుపు శూన్యమవుతోంది. ఒక వ్యక్తి 30 ఏళ్ల కాలపరిమితితో 50 లక్షల ఇంటిలో ను తీసుకుంటే వడ్డీతో కలిపి అతను దాదా పు కోటి రూపాయలపైనే తిరిగి చెల్లిస్తాడు.

అంటే తన జీవిత కాలంలో సగం సంపాదనను కేవలం వడ్డీ రూపంలోనే బ్యాంకులకు ధారపోస్తున్నాడు. మధ్య తరగతి వ్యక్తి ఆదాయం పెరిగిన ప్పటికీ, నికర ఆస్తి మాత్రం పెరగడం లేదు. చక్రవడ్డీ రూపం లో బ్యాంకులు లాగేసుకుంటున్న సొమ్మే దీనికి ప్రధాన కారణం. 

వెట్టి చాకిరీ..

తనకంటూ  సొంత వ్యాపా రం ప్రారంభించాలన్నా, ఆసక్తి గల రంగంలోకి మారాలన్నా నెలనెలా కట్టాల్సిన ఈఎంఐలు మన వృత్తి జీవితంపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నా యి. నాలుగు ఈఎంఐలు కట్టా ల్సి ఉంటే తన ఉద్యోగంలో ఎంత ఒత్తిడి ఎదురైనా మౌ నంగా భరించాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది. దీనివల్ల వ్యక్తిగత స్వేచ్ఛ క్రమంగా హరించు కుపోయి పని ప్రదేశంలో అవమానాలు ఎదురవుతున్నా, బాస్‌లు వేధిస్తున్నా, పని గంట లు పెరిగినా నోరు మెదపకుండా పనులు చేసుకుంటూ పోతున్నారంటే అదంతా ఈఎంఐల చలువే కావడం గమనార్హం.

ఇలా ఆధునిక వెట్టిచాకిరీతో మధ్యతరగతి కార్పొరేట్ బానిసగా మారిపోతున్నాడు. నేటి సమాజంలో పక్కవాడికి ఉన్న వస్తువు మనకు లేకపోతే తక్కువగా చూస్తారనే భయంతో గౌరవం కోసం కొత్తదానికై అప్పు చేసి మరీ వస్తువులను కొనడం అలవాటుగా మార్చుకుంటున్నారు. ప్రతినెల జీతం పడగానే ఐదవ తేదీకి వాయిదాలన్ని పోయి, చేతిలో చిల్లిగవ్వ లేని పరిస్థితి ప్రతి మధ్యతరగతి ఇంట్లో కనిపిస్తున్నది.

సామాజిక గౌర వం కోసం చేసే అప్పులు మానసిక ప్రశాంతతను హరించడంతో పాటు దీర్ఘకాలంలో రక్తపోటు, మధుమేహం, తీవ్రమైన ఒత్తిడి, గుండె సంబంధిత సమస్యలు పెరిగిపోతున్నాయి. నిరంతరం అప్పుల గురించి ఆలో చించడం, వచ్చే నెల కిస్తీ కట్టగలమా లేదా అనే ఆందోళన మనిషిని శారీరకంగా దెబ్బతీస్తున్నది. 

సంపాదన ముఖ్యం కాదు..

ఆయా సర్వేల ప్రకారం భార్యాభర్తల మ ధ్య వచ్చే గొడవల్లో 70 శాతం ఆర్థిక కారణా లే ఉంటున్నాయి. అప్పుల భారం వల్ల కలిగే చికాకు కుటుంబంలో ప్రశాంతతకు దూ రమై కుటుంబంలో గొడవలకు దారితీస్తోం ది. వాయిదాల పద్ధతి సౌకర్యార్థం పుట్టిందే కావచ్చు, కానీ అది జీవితాన్నే వాయిదాల పాలు చేయకూడదు. ఆర్థిక క్రమశిక్షణ లేని చోట స్వేచ్ఛా జీవనానికి చోటు ఉండదు. వస్తువుల కంటే అనుభవాలకు, అప్పుల కం టే పొదుపుకు ప్రాధాన్యత ఇచ్చినప్పుడే మధ్యతరగతి మనిషి ఈఎంఐల బంధనాల నుంచి విముక్తి.

సాంకేతికత సౌకర్యాలు పెరిగిన నేటి కాలంలో ఈఎంఐలను పూర్తిగా కాదనలేం. కానీ అది మన జీవితాలను శాసిం చే స్థాయికి వెళ్లకూడదు. ఆర్థిక స్వేచ్ఛ అంటే ఎక్కువ వస్తువులు కలిగి ఉండటం కాదు, అప్పు లేని నిద్రను కలిగి ఉండటం. మధ్యతరగతి మనిషి తన కలలను వాయిదాల్లో కొ నుక్కుంటూ తన స్వేచ్ఛను వాయి దా వేయకూడదని గుర్తించాలి. వస్తువు కొనే ముందు అది నిజంగా అవసరమా లేక కేవలం మోజు కోసమా అనేది ఆలోచించుకోవాలి. సంపాదన ముఖ్యం కాదు ఎంత మిగిలిస్తున్నామన్నదే ముఖ్యం.

 వ్యాసకర్త సెల్: 8466827118