calender_icon.png 14 October, 2025 | 6:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జపాన్ రాజకీయాల్లో కొత్త అధ్యాయం

08-10-2025 12:00:00 AM

సనాయే టకైచి :

జపాన్ రాజకీయాల్లో 2025 అక్టోబర్ 4న కొత్త అధ్యాయం మొదలైంది. అధ్యక్ష ఎన్నికల్లో లిబరల్ డెమోక్రటిక్ పార్టీ (ఎల్‌డిపి) అభ్యర్థి సనాయే టకైచి విజయం సాధించారు. జపాన్ చరిత్రలో టకైచి తొలి మహిళా ప్రధానిగా సేవలందించనున్నారు. అయితే ఈ విజయాన్ని మహిళా సాధికారత సంకేతంగా మాత్రమే చూడడం సరికాదు. ఆమె రాజకీయ నేపథ్యం, ఆర్థిక విధానాలు, విదేశాంగ వైఖరి అన్నీ కలిపి ఒక క్లిష్టమైన చిత్రాన్ని ఆవిష్కరిస్తున్నాయి.

నిజంగా ఇది కొత్త జపాన్‌కు దారి తీస్తుందా? లేక పాత జాతీయవాదం తిరిగి ముసుగులు మార్చుకొని వస్తుందా అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఎన్నికల్లో పార్టీ ఓటమి అనంతరం మాజీ ప్ర ధాని షిగెరు ఇషిబా రాజీనామా చేయడంతో ఎల్‌డిపికి కొత్త నాయకత్వం అవసరమైంది. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో టకైచి ఐదుగురు పురుష ప్రత్యర్థులను ఓడించి అధ్యక్ష ప దవిని సొంతం చేసుకున్నా రు. దివంగత మాజీ ప్రధాని షింజో అబేకు ఆమెను ‘శిష్యురాలు’గా పరిగణిస్తారు.

షింజో అబే యుగం ముగిసిన తర్వాత, ఎల్‌డిపి తన ఓటు బ్యాం కును తిరిగి స్థిరపర్చుకునేందుకు టకైచిని ఎంచుకోవడం వ్యూహాత్మక చర్య గా కనిపిస్తోంది. ఎందుకంటే ఎల్‌డిపి ఇటీవల ప్ర జా విశ్వాసం కోల్పోయింది. పెరుగుతున్న ధరలు, అవినీతి కేసులు, ప్రజల ఆర్థిక అసంతృప్తి పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీశాయి. అటువంటి సమయంలో ‘స్థిరత్వం, క్రమశిక్షణ, జాతీయ గర్వం’ అనే విలువలపై నిలబడే టకైచిని ముందుకు తీ సుకురావడం పార్టీకి రక్షణ కవచంలా మారింది.

టకైచి ఆర్థిక విధానాలు ‘సనాయేనోమిక్స్’ అని పిలుస్తారు. ఇవి అబే ఆర్థిక విధానాల కు ప్రత్యక్ష  కొనసాగింపే. ఉద్దీపన ఖర్చులను పెంచడం, వడ్డీ రేట్ల సడలిం పు కొనసాగించడం, అవసరమైతే ప్రభుత్వ బాండ్ల ద్వారా అప్పులు జారీ చేయడం వంటి విధానాలకు టకైచి మద్దతు ఇస్తున్నారు. జీతాల పెంపు ద్వారా కొనుగోలు శక్తిని పెంచడం, తద్వారా ఆర్థిక చక్రాన్ని తిరిగి గాడిలో పెట్టడమే ఆ మె అంతిమ లక్ష్యం. కానీ దీనికి ఒక అడ్డంకి ఏర్పడింది.

అదేంటంటే జపాన్ జనాభాలో 30 శాతం 65 ఏళ్ల పైబడిన వృద్ధులే ఉన్నారు. వీరికి సంబంధించిన సామాజిక సంక్షేమ ఖర్చులు బడ్జెట్‌లో మూడొంతులు తినేస్తున్నాయి. దీంతో పాటు టకైచి ‘సంభ నిర్వహణ పెట్టుబడి’ అనే కొత్త సూ త్రాన్ని ప్రవేశపెట్టారు. రక్షణ, సెమీకండక్టర్లు, శక్తి, ఆహార భద్రత వంటి వ్యూహాత్మక రంగాలలో భారీ పెట్టుబడుల ద్వారా భవిష్యత్తులో స్వా వలంబన సాధించడమే దీని లక్ష్యం. అయితే కొందరు ఆర్థికవేత్తలు టకైచి వి ధానాలను విమర్శిస్తున్నారు.

ఇక ఎల్‌డిపికి ప్రస్తుతం పార్లమెంటులో పూ ర్తి మెజారిటీ లేదు. టకైచి ప్రభుత్వం నిలవాలంటే భాగస్వామ్య పార్టీ ‘కోమి’ మద్దతు తప్పనిసరి. కానీ విదేశీ పౌరుల హక్కుల విషయంలో సనాయే టకైచి కఠిన వైఖరిపై కోమి సహా ఇతర మిత్రపక్షాలు తీవ్ర అభ్యంతరం తెలిపాయి. మరి తన పాలనతో సనాయే టకైచి.. జపాన్‌ను కొత్త పేజీకి తిప్పుతుందా లేక పాత పుస్తకాన్నే కొత్త ముఖచిత్రంతో తెరుస్తారా అనేది చూడాలి.

 వ్యాసకర్త: మోహన రావు, 9440485824