14-10-2025 12:12:17 AM
పెబ్బేరు రూరల్, అక్టోబర్ 13 : పెబ్బేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అందుబాటులో ఉన్న అంబులెన్స్ వాహనాన్ని వనపర్తి జిల్లా అధికారి మహబూబ్ సోమవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన సిబ్బందికి పలు సూచనలు చేస్తూ.. ప్రజలకు త్వరితగతిన మరియు నాణ్యమైన అత్యవసర వైద్య సేవలు అందించడంలో 108 సేవల పాత్ర ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు.
అలాగే సిబ్బంది డ్యూటీలో పూర్తి నిబద్ధతతో వ్యవహరించాలని, అంబులెన్స్లోని మెడికల్ ఎక్విప్మెంట్స్, మెడిసిన్స్, సేఫ్టీ గాడ్జెట్స్ సక్రమంగా ఉన్నాయో లేదో నిరంతరం పరిశీలించుకోవాలని సూచించారు.అత్యవసర కాల్ వచ్చిన 15 నిమిషాలలోపు సంఘటనా స్థలానికి అంబులెన్స్ చేరుకోవడం తప్పనిసరి అని ఆయన స్పష్టంగా తెలియజేశారు. 108 సిబ్బంది ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టే విధంగా, సేవల ప్రమాణాలను మరింత పెంచాలని ఆయన ఆదేశించారు. సిబ్బంది పైలెట్ ఎండి ఖాజా ఫారుక్,ఈఏంటీఎస్ మహమ్మద్ మాసం బాబా తదితరులు పాల్గొన్నారు.