calender_icon.png 24 December, 2025 | 2:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పంచాయతీలకు కొత్తందం

24-12-2025 12:48:35 AM

పంచాయతీ రూపురేఖలు మార్చారు 

కేసముద్రం, డిసెంబర్ 23 (విజయక్రాంతి): కొత్తగా ఎన్నికైన పంచాయతీ సర్పం చ్లు పాత పంచాయతీల రూపు రేఖలు మా ర్చి అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మేజర్ పంచా యతీకి 1968లో నిర్మించిన పంచాయతీ భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరింది. ఈ క్రమంలో ఉపాధి హామీ పథకంలో పంచాయతీ కార్యాలయం నిర్మించారు. అయితే అ ది చిన్నగా ఉండడం, అంతలోనే ఇనుగుర్తి మండలంగా ఏర్పడి తహసిల్దార్ కార్యాలయానికి వసతి లేకపోవడంతో ఆ భవనాన్ని తాసిల్దార్ కార్యాలయానికి ఇచ్చారు.

శిథిలమైన పాత భవనంలోనే పంచాయతీని ఇం తకాలం కొనసాగిస్తూ వస్తున్నారు. ఇటీవల కొత్తగా పంచాయతీ భవనానికి నిధులు మంజూరైనప్పటికీ స్లాబ్ వేసి వదిలేశారు. ఈ క్రమంలో పంచాయతీ ఎన్నికలు జరిగి కొత్తగా సర్పంచ్ గా తమ్మడపల్లి కుమార్ ఎ న్నికయ్యారు. సోమవారం పదవి బాధ్యతలు చేపట్టడానికి శిథిలమైన పంచాయతీ భవనాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకున్నారు.

కార్యాలయ పైకప్పు పెంకులు సరి చేయించి, ఆవరణ చుట్టు మొ రం పోయించి, కార్యాలయానికి కొత్తగా రంగులు వేయించారు. అలాగే నేమ్ బోర్డు రాయించి పాత పంచాయతీ భవనానికి కొత్త రూపు తెచ్చారు. కార్యాలయ ఆవరణలో ఉన్న లాల్ బహదూర్ శాస్త్రి విగ్రహాన్ని సర్వంగ సుందరంగా ముస్తాబు చేసి, మూ డు సింహాలతో రూపొందించిన జండా గ ద్దెను కూడా రంగులు వేయించి అందంగా తీర్చిదిద్దారు.

సోమవారం సర్పంచ్ పదవి బాధ్యతల స్వీకారానికి తరలివచ్చిన గ్రామస్తులు వివిధ పార్టీల నాయకులు ఎప్పుడు పడిపోతుందో అనుకున్న పాత పంచాయతీ భవనం రూపురేఖలు పూర్తిగా మారిపోవడాన్ని చూసి ఆనందం వ్యక్తం చేశారు. కొత్తగా నిర్మిస్తున్న భవనాన్ని త్వరగా పూర్తిచేసి అందులోకి మారిస్తే పాత భవనాన్ని సమావేశపు హాలుగా వినియోగించుకోవచ్చని పేర్కొన్నారు. 

అయ్యగారి పల్లిలో..

ఇనుగుర్తి మండలం అయ్యగారి పల్లి లో కూడా శిధిలమైన భవనం సర్పంచ్ చొరవతో కొత్త రూపు సంతరించుకుంది. 2019 లో పంచాయతీగా ఏర్పడ్డ అయ్యగారి పల్లి పంచాయతీకి సొంతభవనం లేకపోవడంతో పాఠశాల ఆవరణలో శిథిలమైన ఓ గదిని కేటాయించారు. ఏడేండ్ల నుంచి అధ్వానమైన పాఠశాల గదిలోనే పంచాయతీ నిర్వహించారు. 

ఈ క్రమంలో కొత్తగా ఎన్నికైన సర్పంచ్ మలిశెట్టి శోభన్ పదవి బాధ్యతల స్వీకారం కోసం పాడుబడ్డ పంచాయతీ భవనాన్ని యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేయిం చి రంగులద్దించి సుందరంగా తీర్చిదిద్దారు. కొత్త సర్పంచుల కృషితో పాత పంచాయతీలు ఇప్పుడు కాస్త చూడముచ్చట గొలుపుతున్నాయి.