24-12-2025 12:49:30 AM
దాఖలైన ఫిర్యాదులపై విచారణ
హైదరాబాద్, డిసెంబర్ 23 (విజయక్రాంతి): గ్రూప్-1 పరీక్షల్లో అక్రమాలు జరిగాయని దాఖలైన పిటిషన్లపై హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం విచా రణను బుధవారానికి వాయిదా వేసినట్లు తెలిసింది. పరీక్షలను పారదర్శకంగా నిర్వహించామని, మూల్యాంకనంలో ఎలాంటి పొరపాట్లూ జరగలేదని న్యాయస్థానం ముందు టీజీపీఎస్సీ వాదనలు వినిపించింది. ప్రతివాదుల తరుఫున న్యాయవా దులు నేడు తమ వాదనలను కోర్టుకు వినిపించనున్నారు. సీజే ధర్మాసనం ఈ పిటిషన్లపై విచారణ చేపట్టింది.