calender_icon.png 24 December, 2025 | 2:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూడాలి

24-12-2025 12:47:08 AM

హాస్టల్ తనిఖీ చేసిన కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ 

మహబూబాబాద్, డిసెంబర్ 23 (విజయక్రాంతి): హాస్టల్లల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, చలికాలంలో అనారోగ్యానికి గురికాకుండా ముందస్తు రక్షణ చర్యలు తీసుకోవాలని హాస్టల్ నిర్వాహకులకు జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఆదేశించారు. మహబూబాబాద్ పట్టణంలోని వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ వసతి గృహాన్ని కలెక్టర్ మం గళవారం కలెక్టర్ ఆకస్మితంగా తనిఖీ చేశారు, స్టోర్ గది, కిచెన్ షెడ్, డైనింగ్ హాల్, టాయిలెట్స్, తరగతి గదులు, పరిసరాలను పరిశీలించారు.

తాజా కూరగాయలు, నిత్యవసర వస్తువులు నాణ్య త పక్కాగా పాటించాలని, భోజనం సిద్ధం చేసే సిబ్బంది తగిన జాగ్రత్తలు వహిస్తూ ఉండాలన్నా రు. శీతకాల నేపథ్యంలో పిల్లలకు డైట్ మెనూ ప్రకారం వేడివేడి ఆహారాన్ని అందించాలని, రాత్రివేళలో పిల్లలకు చలి తీవ్రతను తట్టుకునే విధంగా ఏర్పాట్లు, సౌకర్యాలు కల్పించాలని, వేడి నీరు అందించాలని సూచించారు.

నూతన టెక్నాలజీ వినియోగించి పరీక్షలకు సిద్ధమయ్యే విధంగా ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు కృషి చేయాలని ప్రత్యేక తరగతులు నిర్వహించాలని సూచించారు. స్టడీ అవర్లో ఉన్న పిల్లలతో స్వయంగా మాట్లాడి విద్య సామర్ధ్యాలను పరిశీలించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలను మండల ప్రత్యేక అధికారులు, తహసిల్దార్లు తనిఖీలు నిర్వహించారు.