15-08-2025 12:07:57 AM
పెంచల్‌రెడ్డి, సుధాకర్‌గౌడ్, ఝాన్సీ, ప్రతిమ, నాగేశ్వరరావు కీలక పాత్రల్లో నటించిన లఘుచిత్రం ‘ఆపద్బాంధవుడు’. శ్రీలక్ష్మి ఎడ్యుకేషనల్ ఛారిటబుల్ ట్రస్ట్, సంతోష్ ఫిలింస్ బ్యానర్‌పై పలు బాలల చిత్రాలను రూపొందించిన దర్శక నిర్మాత భీమగాని సుధాకర్ గౌడ్ రచనాదర్శక త్వంలో తాజా సినిమా వస్తోంది. పెంచల్‌రెడ్డి. డీ లీలావతి నిర్మాతలు. ఈ మూవీ టీమ్ గురువారం హైదరాబాద్‌లో విలేకరులతో సమావేశ మైంది.
ఈ సందర్భంగా దర్శకుడు సుధాకర్‌గౌడ్ మాట్లాడుతూ.. “సేవా రత్నగా గుర్తింపు పొందిన వ్యక్తి పెంచల్‌రెడ్డి జీవితం ఆధారంగా ‘ఆపద్బాం ధవుడు’ చిత్రాన్ని రూపొందించాం. ఇది సజీవ పాత్రలతో సాగే సినిమా. దీన్ని బయోపిక్‌లా, లైవ్‌గా, సరికొత్త పద్ధతిలో తెరకెక్కించాం. సెప్టెంబర్ 5న ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ప్రభుత్వం ఈ చిత్రాన్ని వాలెంటరీ ఆర్గనైజేషన్స్ ద్వారా ప్రదర్శిస్తే ఎంతోమందిలో సేవాభావం కలిగించినవారం అవు తాం” అన్నారు.
“మాది వ్యవసాయ కుటుంబం. జీవీకే కంపెనీలో చిన్న ఉద్యోగిగా చేరాను. నా సంపాదనలో 50 శాతం విరాళాల రూపంలో సేవా కార్యక్రమాలకు వినియోగిస్తున్నాను. నా జీవిత కథను సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు దర్శకుడు భీమగాని సుధాకర్ గౌడ్. ఈ లఘుచిత్రం ప్రేక్షకులకు స్ఫూర్తి కలిగిస్తుందని ఆశిస్తున్నా” అని పెంచల్‌రెడ్డి తెలిపారు.