calender_icon.png 4 November, 2025 | 4:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తమ్మర వాగులో గల్లంతైన వ్యక్తి

03-11-2025 10:19:40 PM

గల్లంతైన వ్యక్తి కోసం ఆపరేషన్ నిర్వహిస్తున్న రెస్క్యూ టీం..

కోదాడ: తమ్మర వాగులో ఆదివారం సాయంత్రం వ్యక్తి గల్లంతైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుని కొడుకు భూక్య నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం... భూక్య వెంకటేశ్వర్లు స్వగ్రామం కోదాడ మండల పరిధిలోని కూచిపూడి తండా గ్రామం జీవనోపాధి కోసం 25 సంవత్సరాల క్రితం కోదాడకు వచ్చి కరెంట్ ఆఫీస్ వెనుక నివాసం ఉంటూ పాడి గేదెలతో జీవనం కొనసాగిస్తున్నారు. రోజు మాదిరిగానే ఆదివారం గేదెలను తోలుకొని స్థానిక శిరిడి సాయి నగర్ లోని కాళీ ప్లాట్ లలో గేదెలు మేపటానికి వెళ్లాడు.

సాయంత్రం అవుతున్న తిరిగి రాకపోవడంతో ఏం జరిగిందని మేము రాగా గేదలు ఉన్నాయి కానీ మా నాన్న కనిపించలేదని అన్నారు. చుట్టుపక్కల వెతికిన ఆచూకీ లభించలేదు. సోమవారం పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా వారు రెస్క్యూ టీమ్స్ కి సమాచారం తెలపమనగా రెస్క్యూ టీమ్స్ వారికి సమాచారం అందించామన్నారు. స్టేషన్ ఫైర్ ఆఫీసర్ సుబ్బిరామిరెడ్డి ఆదేశాల మేరకు ఎస్డిఆర్ఎఫ్ టీం రిస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు.