03-11-2025 10:32:36 PM
							3 కోట్ల రూపాయల వ్యయంతో ఎల్లారెడ్డి పెద్దచెరువు అభివృద్ధి పనులకు శంకుస్థాపన..
ఎల్లారెడ్డి (విజయక్రాంతి): ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఎన్నో ఏళ్ల నుండి ఎల్లారెడ్డి పట్టణ ప్రజలు కలలు కన్నా మోడల్ మినీ ట్యాంక్ బండ్ పెద్ద చెరువు రూపురేఖలు మారనున్నాయి. ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్ మోహన్ సోమవారం రూ. 3 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న పెద్దచెరువు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ మాట్లాడుతూ.. “ఎల్లారెడ్డి పెద్దచెరువును ఆధునిక సదుపాయాలతో ముస్తాబు చేయాలని మా లక్ష్యం. పార్క్, ఫుడ్ కోర్టులు, ఓపెన్ జిమ్ వంటి సౌకర్యాలతో పెద్దచెరువు ప్రాంతం ప్రజల వినోదానికి, విశ్రాంతికి చక్కని ప్రదేశంగా తీర్చిదిద్దుతాం” అని అన్నారు.
అభివృద్ధి పనులు పూర్తయ్యాక పెద్దచెరువు ఎల్లారెడ్డి పట్టణానికి ఒక ఆకర్షణీయమైన కేంద్రంగా మారనుందని ఎమ్మెల్యే మదన్ మోహన్ తెలిపారు. ఎల్లారెడ్డి పట్టణంలో, నుండి మొదలుకొని ఎల్లారెడ్డి మండలంలోని దాల్ మల్కపల్లి గేట్ వరకు, విద్యుత్ దీపాలతో విరజిల్లుతుందని, ఎమ్మెల్యే మదన్ మోహన్ అన్నారు. మినీ ట్యాంక్ బండ్ పనులను త్వరితగతి నా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మహేష్ కుమార్, ఏ ఈ, వినోద్, మున్సిపల్ మాజీ చైర్మన్ కుడుముల సత్యనారాయణ, మాజీ చైర్మన్ పద్మ శ్రీకాంత్, ఎల్లారెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రజిత వెంకటరామిరెడ్డి, ఎల్లారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కురుమ సాయిబాబా, తదితరులు పాల్గొన్నారు.