calender_icon.png 4 November, 2025 | 5:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జోనల్ స్పోర్ట్స్ మీట్ ను విజయవంతం చేయాలి

03-11-2025 10:14:38 PM

గురుకులం ప్రిన్సిపాల్ సంధ్యారాణి..

తుంగతుర్తిలో ఈనెల 6, 7, 8 తేదీల్లో 11వ జోనల్ స్పోర్ట్స్ మీట్..

తుంగతుర్తి (విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల, కళాశాలలో 11వ జోనల్ స్పోర్ట్స్ మీట్ ఈ నెల 6 నుండి 8 వరకు జరగనున్నాయని ప్రిన్సిపాల్ సంధ్యారాణి తెలిపారు. సోమవారం మండల కేంద్రంలోని పాఠశాలలో జోనల్ స్పోర్ట్స్ మీట్ పై సమావేశం నిర్వహించి మాట్లాడారు. జోన్-5 నుంచి 9 పాఠశాలలకు చెందిన 765 మంది విద్యార్థులు స్పోర్ట్స్ మీట్ లో పాల్గొంటున్నట్లు తెలిపారు. తుంగతుర్తి, జాజిరెడ్డిగూడెం, వలిగొండ, చౌటుప్పల్, నర్మెట్ట, జాఫర్ ఘడ్, పాలకుర్తి, ఆలేరు, అడ్డగూడూరు పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొంటారని తెలిపారు.

స్పోర్ట్స్ మీట్ సందర్భంగా ఏర్పాటు చేసిన కమిటీల సభ్యులు తమ విధులను సమర్థవంతంగా నిర్వహించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కేటాయించిన బాధ్యతలను పాటిస్తూ వచ్చిన విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. ఈ నెల 5 సాయంత్రం వరకు ఆయా పాఠశాలల విద్యార్థులు క్రీడల్లో పాల్గొనేందుకు తుంగతుర్తి చేరుకుంటారని, విద్యార్థులకు తగిన సౌకర్యాలను కల్పించాలని సూచించారు. జోనల్ స్థాయిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను రాష్ట్రస్థాయికి ఎంపిక చేస్తారని  పీడీ, పీఈటీలు క్రీడల నిర్వహణలో నియమ, నిబంధనలు పాటిస్తూ ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా క్రీడలను నిర్వహించాలన్నారు. వాలీబాల్, ఖోఖో, కబడ్డీ, టెన్నికాయిట్, రింగ్ బాల్, రన్నింగ్, లాంగ్ జంప్, హై జంప్ తదితర క్రీడలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.