calender_icon.png 13 December, 2025 | 6:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మానవత్వం మరిచిపోని పోలీసు

12-12-2025 12:04:07 AM

ఎన్నికల డ్యూటీలో ఆదర్శంగా నిలిచిన కానిస్టేబుల్ శ్రీను

నవాబ్ పేట్, డిసెంబర్ 11:  మండలం ధర్పల్లి గ్రామం లో ఎన్నికల సందర్భంగా హృదయాన్ని హత్తుకునే ఘటన చోటుచేసుకుంది. పోలింగ్ బూత్ వద్ద వీల్చైర్ అందుబాటులో లేక, నడవలేని పరిస్థితిలో ఓటు వేయడానికి వచ్చిన వృద్ధురాలిని గుర్తించిన మహబూబ్నగర్ జిల్లా పోలీస్ కానిస్టేబుల్ శ్రీను వెంటనే స్పందించారు. వృద్ధురాలి అసౌకర్యాన్ని గుర్తించిన ఆయన, తన చేతుల మీదుగా ఎత్తుకొని పోలింగ్ బూత్ వరకు తీసుకెళ్లి ఆమె ఓటు హక్కు వినియోగించుకునేలా చేయడం ద్వారా మానవత్వాన్ని చాటుకున్నారు.

ఎన్నికల విధుల్లో మాత్రమే కాకుండా, సేవాభావం మరియు కర్తవ్యనిబద్ధతకు నిదర్శనంగా నిలిచిన కానిస్టేబుల్ శ్రీను,జిల్లా ఎస్పీ డీ. జానకి, కానిస్టేబుల్ శ్రీను ప్రవర్తనను అభినందిస్తూ, పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క అసలు లక్ష్యం ప్రజలకు సేవ చేయడం, శ్రీను చేసిన ఈ సేవ ప్రతి పోలీసు సిబ్బందికి ఆదర్శంగా నిలుస్తుంది అని పేర్కొన్నారు. మానవత్వంతో కలిసిన కర్తవ్యనిర్వహణకు ఇది నిలువెత్తు ఉదాహరణగా నిలిచిపోయింది.