calender_icon.png 13 December, 2025 | 6:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రశాంతంగా ముగిసిన మొదటి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్

12-12-2025 12:04:10 AM

ఖమ్మం టౌన్, డిసెంబర్ 11 (విజయ క్రాంతి): జిల్లాలో జరుగుతున్న తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. ఓటర్లు ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని పేర్కొన్నారు. ఒంటి గంట వరకు వచ్చి క్యూలైన్లో ఉన్న వారందరికీ ఓటు వేసే అవకాశం కల్పించారు ఎన్నికల అధికారులు అని అన్నారు.

పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పట్టిస్టమైన బందోబస్త్ తో పోలీస్ అధికారులు పర్యవేక్షించారని అన్నారు. ఓట్ల లెక్కింపు పక్రియ సమయంలో ఎలాంటి గొడవలు జరగకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్తలతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిందని అన్నారు. కౌంటింగ్ కేంద్రం వద్ద ఎక్కువ మందిని ఉండకుండా చర్యలు తీసుకున్నామన్నారు. ప్రశాంతంగా వున్న గ్రామాల్లో సమస్య సృష్టించే వ్యక్తులను ముందుస్తుగానే 6వేల మందికి పైగా బైండోవర్ చేసినట్లు తెలిపారు.