14-10-2025 12:15:59 AM
సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి
కొత్తపల్లి, అక్టోబర్ 13 (విజయక్రాంతి): కరీంనగర్ నగర శివారు ప్రాంతాలు బొమ్మకల్, ముగ్దుంపూర్, కరీంనగర్ రూరల్ మండలంలోని చర్లభుత్కూర్, చామన్ పల్లి గ్రామాల్లో పలువురు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్ల భూమిపూజ కార్యక్రమాలలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి పని చేస్తుందని ప్రతి కుటుంబానికి పక్కా ఇల్లు ఉండాలన్నదే రేవంత్ రెడ్డి ప్రభుత్వ లక్ష్యమన్నారు.ఆనాడైన ఈనాడైన ఇందిరమ్మ రాజ్యంలోనే ఇళ్లు కట్టించడం జరుగుతుందని మిగితా ప్రభుత్వాలు మాటల వరకే పరిమితం అయ్యాయని పేర్కొన్నారు.
అర్హులై ఉండి ఇళ్లు మంజూరు కాక మిగిలిపోయిన ప్రతి ఒక్కరికి రాబోయే రోజుల్లో తప్పకుండా మంజూరు చేస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ అధ్యక్షులు సాయిని తిరుపతి, మండల్ అధ్య క్షులు కామరెడ్డి రాంరెడ్డి, pacs వైస్ చైర్మన్ బీరం ఆంజనేయులు,మీసాల సాయిలు, గంగయ్య, నరసయ్య, కూర నరేష్ రెడ్డి, బుర్ర నారాయణ, రంగయ్య, జగ్గాని కనకయ్య, శంకరయ్య, బుర్ర గంగయ్య, రామస్వామి, దామోదర్ రెడ్డి, దిలీప్ రెడ్డి, బుసా సాయి, రాము, సుదర్శన్, బుర్ర హరీష్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.