calender_icon.png 14 October, 2025 | 3:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మరమ్మతులు మంచిగా చేయండి

14-10-2025 12:15:53 AM

మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్ కుమార్‌రెడ్డి

మహబూబ్ నగర్ టౌన్, అక్టోబర్ 13: తాగునీటి సరఫరాకు సంబంధించి లీకేజీ పైపుల మరమ్మత్తు మరింత బాగుండేలా చేయాలని మహబూబ్ నగర్ మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి అన్నారు.

సోమవారం జిల్లా కేంద్రంలో న్యూ మోతి నగర్ లో లీకైన పైపులైన్ మరమత్తు పనులను మున్సిపల్ కమిషనర్ ప్రత్యేకంగా పరిశీలించారు. మరమతో చేసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఆ ప్రాంతంలో లీకేజి కాకుండా ఉండాలని నియమ నిబంధనలు పాటించి మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు ఉన్నారు.