calender_icon.png 13 May, 2025 | 5:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నకిలీ విత్తనాల పట్ల అప్రమత్తత అవసరం

13-05-2025 12:28:26 AM

ఎమ్మార్పీ ధరలకే విక్రయించాలి

మునుగోడు,మే 12 (విజయ క్రాంతి): రైతులు అనుకూలమైన దిగబడును పొందేందుకు నకిలీ విత్తనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని డీలర్లు విత్తనాలు ఎరువులు పురుగుమందులను ఎమ్మార్పీ ధరలకు విక్రయించాలని మండల వ్యవసాయ అధికారిని పద్మజ అన్నారు.

సోమవారం మునుగోడు  మండలం లోని ఎరువుల దుకాణాల డీలర్లకు మునుగోడు రైతువేదిక లో సమావేశం ఆమె మాట్లాడారు.రైతులకు విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు సకాలంలో అందుబాటులో ఉంచాలని  అధిక ధరలకు విక్రయిస్తే  దుకాణా దారులపై కఠిన చర్యలు తీసుకుంటామని,దుకాణాలను సైతం సీజ్ చేస్తామని  హెచ్చరించారు.

విత్తనాలు,ఎరువుల అమ్మకపు వివరాలను  రికార్డుల్లో ప్రతిరోజు పొందుపరచాలని అన్నారు. పత్తి విత్తనాల ధర 901, వ్యవసాయ అధికారి ఫోన్  నెంబర్  తో ఫ్లెక్సీలను  ప్రతి విత్తన దుకాణాల ముందు పెట్టాలని సూచించారు. రైతులకు బిల్లు కచ్చితంగా ఇవ్వాలని అన్నారు.నకిలీ విత్తనాలు, లూజ్ విత్తనాలు ఎవరైనావా విక్రయం చేస్తే తమకు సమాచారం ఇవ్వాలని,నకిలీ విత్తనాలు కొని రైతులను మోసపోవద్దని లైసెన్స్ వున్న దుకాణాల వద్ద మాత్రమే విత్తనాలు కొనుగోలు చేసి బిల్లుల ను పంట కాలం పూర్తి అయ్యేవరకు జాగ్రత్త చేసుకో వాలని రైతులకు సూచించారు.  విత్తన, ఎరువుల మరియు పురుగు మందుల చట్టాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో మునుగోడు మండల డీలర్లు ఉన్నారు.