12-11-2025 12:31:25 AM
అల్లరి నరేశ్ నుంచి రాబోతున్న చిత్రం ’12 ఏ రైల్వే కాలనీ’. నూతన దర్శకుడు నాని కాసరగడ్డ రూపొందిస్తున్న ఈ సినిమాను శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. ‘పొలిమేర’ సిరీస్ ఫేమ్ డాక్టర్ అనిల్ విశ్వనాథ్ ఈ చిత్రానికి షోరన్నర్‌గా పనిచేస్తూ కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ రాశారు. కామాక్షి భాస్కర్ల హీరోయిన్‌గా నటిస్తోంది. నవంబర్ 21న విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్‌ను మంగళవారం విడుదల చేశారు.
ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో అల్లరి నరేశ్ మాట్లాడుతూ.. “నేను ఇలాంటి థ్రిల్లర్స్ ఎప్పుడూ చేయలేదు. చాలా మల్టీ లేయర్స్ ఉండే కథ. చాలా రేసి ఎక్సైటింగ్ సినిమా ఇది. అనిల్ రైటింగ్ స్కిల్స్ నాకు చాలా ఇష్టం. డైరెక్టర్ నాని సినిమాని చాలా అద్భుతంగా తీశాడు. ఎవరు విలన్ అవుతారనేది గెస్ చేయలేరు.. ఈ సినిమా చూసి రెండు మూడు చోట్ల మీరు జర్క్ అవుతారు” అన్నారు.
‘ఇది నా కెరీర్ లో బెంచ్ మార్క్ సినిమా అవుతుందని నమ్మకం ఉంద’ని హీరోయిన్ కామాక్షి అన్నారు. డైరెక్టర్ నాని మాట్లాడుతూ.. “నా పేరు నాని. నవంబర్ 21 తర్వాత ఈ పేరు గట్టిగా వినిపిస్తుందని బలంగా నమ్ముతున్నా” అన్నారు. షో రన్నర్ అనిల్, మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్, మిగతా చిత్రబృందం పాల్గొన్నారు.